రాయిపై బట్టలు లేకుండా యువతి.. ఎక్కడ ఉందో చెప్పండి చూద్దాం!

కొందరు కళాకారుల్లో అరుదైన ప్రతిభ ఉంటుంది.ఆ ప్రతిభను చూసి అవతలి వ్యక్తులు అవాక్కవ్వాల్సి వస్తుంది.

 Body Painting Artist Blends Nude Models In Various Landscapes Body Painting Art-TeluguStop.com

ఈ మధ్య కాలంలో కొందరు కళాకారులు బాడీ పెయింటింగ్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నారు.తాజాగా సోషల్ మీడియాలో ఒక పెయింటింగ్ ఫోటో తెగ హల్చల్ చేస్తోంది.

సాధారణంగా చూస్తే ఆ ఫోటోలో కొండలు ఆ కొండల వెనుక సముద్రం మినహా ఏమీ కనిపించవు.కానీ సరిగ్గా ఈ ఫోటోను పరిశీలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

కొండపై నగ్నంగా పడుకున్న యువతి పెయింటింగ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్ వేసిన ఆ వ్యక్తి పేరు జార్గ్ డస్టర్‌వాల్డ్.ఇతను వేసిన పెయింటింగ్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రకృతితో మమేకం అయ్యే విధంగా పెయింటింగ్స్ ను రూపొందించడం జార్గ్ ప్రత్యేకత.

జార్గ్ పెయింటింగ్స్ తో ఇలాంటి అద్భుతాలు చేయడం ఇదే తొలిసారి కాదు.గడిచిన మూడు దశాబ్దాలుగా జార్గ్ తన పెయింటింగ్స్ తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.

అలా జార్గ్ సృష్టించిన అద్భుతాల్లో పైన ఉన్న పెయింటింగ్ ఒకటి.అయితే ఎంతో పరిశీలనగా చూస్తే తప్ప రాయిలో దాగి ఉన్న యువతి ఫోటోను గుర్తు పట్టలేము.

జార్గ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను బుర్రకు పని చెబుతున్నారు.అయితే ఇంతసేపు చూసినా ఆ యువతి ఫోటోను మీరు కనిపెట్టలేక పోతే మాత్రం కింద ఉన్న ఫోటోలో ఎరుపు రంగులో మార్క్ ను చూస్తే సులువుగా యువతి ఎక్కడుందో కనిపెట్టవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube