బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిహారిక( Niharika ) ఒకరు.నిహారిక అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీకదీపం( Karthika Deepam ) సీరియల్ లో శ్రావ్య అంటే టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తారు.
ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రావ్య ప్రస్తుతం ఇతర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో హారిక పాత్రలో కూడా సందడి చేస్తున్నారు.
అలాగే జెమిని ఛానల్ లో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నిహారిక నటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిహారిక తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి ( Marriage )సంబంధించిన హల్ది ఫోటోలు( Haldi Photos ) పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె వివాహ వేడుకలలో కార్తీకదీపం సౌందర్య కూడా పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నిహారిక రోషన్ కుమార్( Roshan Kumar ) అనే వ్యక్తితో మే 10వ తేదీ 7 అడుగులు వేశారు.
ఇలా ఈమె తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి చూసినటువంటి నేటిజన్స్ పెద్ద ఎత్తున నిహారిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఈమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నిహారిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.వరుస బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఈమె ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నిహారిక వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టారని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.