కమల్ 'విక్రమ్' దూకుడు.. ఐదేళ్ల బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.ఈయన తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.

 Kamal Haasan's Film Mints Rs 130 Crore In Tamil Nadu, Kamal Haasan, Tamil Nadu,-TeluguStop.com

అందుకే ప్రేక్షకుల చేత లోకనాయకుడు అని కూడా పిలుపించు కుంటాడు.చాలా రోజులుగా ఫామ్ లో లేకపోయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.

కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఇక తాజాగా కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.ఈ డైరెక్టర్ కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.వారి ఎదురు చూపులు ఫలించేలా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ వ్యక్తం చేస్తున్నారు.జూన్ 3న రిలీజ్ అయినా ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో హిట్ మూవీగా డిసైడ్ చేసేసారు.

Telugu Bahubali, Fahad Fazil, Kamal Haasan, Kamalhaasans, Tamil Nadu, Vijaysethu

ఇప్పటికే ఈ సినిమా తమిళనాడులో 8 రోజులలో రన్ లో 110 కోట్ల కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఇక ఈ సినిమా ముందు ముందు తమిళనాడులో రికార్డులు తిరగ రాస్తుందని అంతా అంటున్నారు.బాహుబలి 2 సృష్టించిన 5 ఏళ్ల నాటి రికార్డును కూడా బద్దలు కొట్టనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తమిళ నాడులో ‘బాహుబలి 2’ 155 కోట్ల జీవితకాల కలెక్షన్ లతో నంబర్ వన్ స్థానంలో ఉంది.

ఆ తర్వాత స్థానంలో విజయ్ సేతుపతి బిగిల్ 141 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది.

మరి ఇప్పటికే విక్రమ్ సినిమా 130 కోట్ల మార్క్ టచ్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా అవతరించింది.మరి ఈ వారం కూడా గడిస్తే బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube