కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది!

కే‌సి‌సి (కిసాన్ క్రెడిట్ కార్డ్) అంటే అందరికీ తెలిసిందే.దేశీయంగా వ్యవసాయం చేస్తున్న రైతుల( Farmers )కు వివిధ బ్యాంకులు రైతుల కోసమై తక్షణ రుణాన్ని పొందే కార్డుని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు.

 Just Apply For Kisan Credit Card Like This , Apply ,for ,kisan Credit Card , Fa-TeluguStop.com

రైతులకు వారి పంట ఉత్పత్తి మరియు ఇతర వ్యవసాయ అవసరాల నిమిత్తం తగిన రుణ మద్దతును అందించడానికి 1998లో భారత ప్రభుత్వం ఈ కే‌సి‌సి పథకాన్ని స్టార్ట్ చేసింది.ఈ కార్డ్ ఏటి ‌ఎం నుండి నగదు తీసుకోవడానికి లేదా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మొదలైన వ్యవసాయ ఇన్‌పుట్‌ లను కొనుగోలు చేయడానికి పనికి వస్తుంది.

Telugu Process, Bank, Credit, Farmers Farmers, Apply, Kisan Credit, Latest-Lates

అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే విషయంలో చాలమందికి కొన్ని అపోహలు వున్నాయి.ముఖ్యంగా దరఖాస్తు విషయంలో కాస్త తడబడుతున్నారు.అది చాలా సింపుల్.దానికోసం రైతులు భూమికి( Farmers ) సంబంధించిన రుజువు, గుర్తింపు రుజువు మరియు ఆదాయ రుజువుతో సహా అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది.

ఆన్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డ్ ( KCC ) కోసం చాలా తేలికగా దరఖాస్తు చేసుకోవచ్చు.దానికోసం కే‌సి‌సి కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్ళాలి.

Telugu Process, Bank, Credit, Farmers Farmers, Apply, Kisan Credit, Latest-Lates

తరువాత దరఖాస్తు బటన్‌పై క్లిక్ చేసి, అడిగిన వివరాలు అనగా మీ వ్యక్తిగత మరియు వ్యవసాయ వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ ను పూర్తిచేయవలసి వుంటుంది.ఆ తరువాత సంబందిత బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మీ దరఖాస్తును స్వీకరించిన తర్వాత, వారు దానిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది.ఆ తరువాత కొన్ని రోజులకు ధృవీకరణ మరియు డాక్యుమెంటేషన్ కోసం మిమ్మల్ని వారే స్వయంగా ఫోనులో సంప్రదిస్తారు.ధృవీకరణ పూర్తయిన తర్వాత, మీ కిసాన్ క్రెడిట్ కార్డ్ సరాసరి మీ ఇంటికే వచ్చేస్తుంది.

అయితే ఇక్కడ ముఖ్యమైన మరో విషయం గుర్తు పెట్టుకోవాలి.మీరు KCC కోసం దరఖాస్తు చేస్తున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను బట్టి ఖచ్చితమైన ప్రక్రియ మరియు అవసరాలు మారే అవకాశం వుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube