చాలా మందికి చర్మం సున్నితంగా ఉండుట వలన చర్మం తొందరగా డేమేజ్ అవుతుంది.దాంతో వయస్సులో పెద్దవారిగా కనపడటమే కాకుండా ముడతలు,ఫైన్ లైన్స్ కూడా వచ్చేస్తాయి.
ఈ ముడతలు,ఫైన్ లైన్స్ వదిలించుకోవడానికి మార్కెట్ లో దొరికే యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు.అవి వాడటం వలన కొన్ని సేడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.
అందువల్ల ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఉపయోగిస్తే మీరు
ముడతలు,ఫైన్ లైన్స్ బారి నుండి సులభంగా బయట పడవచ్చు.
అంతేకాక ఈ చిట్కా ముఖం మీద పేరుకున్న మురికి,మలినాలు తాన్ తొలగించటానికి బాగా సహాయపడి ముఖాన్నీ కాంతివంతంగా మారుస్తుంది.
ముఖం మీద ముడతలను మాయం
చేసి యవ్వనంగా కన్పించేలా చేసే ఆ చిట్కా గురించి తెలుసుకుందాం.ఈ
చిట్కాకు కావలసినవి గ్రీన్ టీ పొడి,పెరుగు.ఈ రెండింటిని ఉపయోగించి ముఖం
మీద ఏర్పడ్డ ముడతలు,ఫైన్ లైన్స్ తొలగించుకొని ముఖాన్ని కాంతివంతంగా
మార్చుకోండి.
గ్రీన్ టీలో యాంటీ ఏజింగ్ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచి ముడతలు,ఫైన్ లైన్స్ తొలగించటంలో సహాయపడుతుంది.
చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది.అలాగే దెబ్బ తిన్న చర్మ కణాలను రిపేర్ చేసి చర్మాన్ని కాంతివంతంగా
చేస్తుంది.పెరుగులోని లాక్టిక్ ఆమ్లాలు,పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన
చర్మంపై పేరుకున్న నలుపు,మలినాలను తొలగించి చర్మం తెల్లగా కాంతివంతంగా
అయ్యేలా చేస్తాయి.ఈ రెండు పదార్ధాల కాంబినేషన్ మీ ముఖానికి కాంతిని
ఇవ్వటంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ చిట్కాను ఎలా చేయాలో తెలుసుకుందాం.మొదట గ్రీన్ టీ ని మెత్తని పొడిగా చేసుకోవాలి.రెండు స్పూన్ల గ్రీన్ టీ పొడిలో సరిపడా పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పేస్ ప్యాక్ వలె అప్లై చేసి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఈ పేస్ ప్యాక్ ఆరిపోయాక నీటిని పోస్తూ సున్నితంగా మసాజ్ చేస్తూ కడిగేయాలి.ఈ ప్యాక్ చర్మంలో ముడతలు తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
అలాగే చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది.ఈ ప్యాక్ ని రోజు విడిచి రోజు ఉపయోగిస్తే మంచి ఫలితాలు తొందరగా వస్తాయి.