ఆరేళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఎద్దు.. ఎలాగంటే..

కేవలం మనుషులు మాత్రమే కాదు అప్పుడప్పుడు జంతువులు కూడా ప్రపంచ రికార్డులను నెలకొల్పుతుంటాయి.అందుకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు ఇదివరకే సోషల్ మీడియాలో చాలానే చూశాం.

 The Bull That Set The Guinness World Record In Six Years How , Guinness World R-TeluguStop.com

తాజాగా ఓ ఎద్దు సంబంధించి గిన్నిస్ ఓ ప్రశంస పత్రాన్ని అందజేసింది.ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.

తాజాగా ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Record )లో తన పేరుని నమోదు చేసుకుంది.వినడానికి ఆశ్చర్యం వేసిన ఇది మాత్రం నిజం.కేవలం ఆరు సంవత్సరాల ఉన్న హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డులను సృష్టించింది.

ఈ ఎద్దు అమెరికాలోని ఒరేగాన్ లో ఓ జంతు సంరక్షణ కేంద్రంలో ఉంది.ఈ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉండడంతో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా సౌమ్యంగా ఉంటుందని దానికి సంరక్షకులు తెలుపుతున్నారు.

ఇక ఈ రికార్డు సంబంధించి వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వీడియోను షేర్ చేయగా.ప్రస్తుతం అది వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న రోమియో( Romeo ) పేరు గల ఎద్దు 1.94 మీటర్ల ఎత్తు అనగా ఆరడుగుల 4.5 అంగుళాలు ఉండడంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా రికార్డు సృష్టించింది.ఈ రోమియో ఎద్దు ఆహారాన్ని బాగా ఇష్టపడుతుంది.

ముఖ్యంగా ఆపిల్, అరటి పండ్లు లాంటి వాటిని తరచు ఎక్కువగా తీసుకుంటుందని దాని సంరక్షకులు తెలుపుతున్నారు.వీటితోపాటు ప్రతిరోజు ఈ ఎద్దు 45 కేజీల ఎండు గడ్డిని.

, అలాగే తృణధాన్యాలను ఆహారంగా తీసుకోగలదని సంరక్షకులు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube