న్యూయార్క్‌కు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి .. పన్నుల ద్వారా ఎంత ఆదాయమో తెలుసా..?

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కు సందర్శకుల ద్వారా భారీ ఆదాయం లభించింది.ఇది కరోనాకు ముందు కంటే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.గతేడాది 62.2 మిలియన్ల మంది న్యూయార్క్‌ను సందర్శించారని స్టేట్ కంప్ట్రోలర్ థామస్ డినాపోలీ( State Comptroller Thomas DiNapoli ) గురువారం విడుదల చేసిన నివేదికలో తెలిపారు.ఇది 2019లో కోవిడ్ ముందుకంటే (66 మిలియన్లు) తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా రికార్డు స్థాయిలో 4.9 బిలియన్ల అమ్మకాలతో పాటు ఇతర పర్యాటక సంబంధిత పన్ను ఆదాయాన్ని అందిస్తారని అంచనా వేశారు.2020 నుంచి హోటల్ గదులు, ఇతర సేవల ధరల పెరుగుదల కారణంగా 16 శాతం వృద్ధిని అంచనా వేశారు.

 New York Citys Tourists Fuel Record $4.9 Billion In Tax Revenue , New York City,-TeluguStop.com

2020 ప్రారంభంలో మొదలైన కోవిడ్ 19 న్యూయార్క్ నగరాన్ని స్తంభింపజేసింది.వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు ఆఫీసులు, రిటైల్ మార్కెట్‌ను నాశనం చేసింది.దీంతో ప్రజలు శివారు ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు.అయితే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో న్యూయార్క్‌లో తిరిగి బ్రాడ్ వే ప్రదర్శనలు, మ్యూజియంలు ఇతర టూరిస్ట్ స్పాట్‌‌లు పర్యాటకులతో కిటకిటలాడుతూ స్థిరమైన ఆర్ధిక వృద్ధిని పొందుతోంది.

Telugu York, Yorkcitys, Pre Pandemic, Tourism-Telugu NRI

పర్యాటక అధికారులు( Tourism authorities ).ఈ ఏడాది న్యూయార్క్ నగరం ప్రీ పాండమిక్( Pre-pandemic ) స్థాయిని అధిగమిస్తుందని అంచనా వేశారు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకులు ఊహించిన దానికంటే నెమ్మదిగా వస్తున్నారు.అంతర్జాతీయ, వ్యాపార ప్రయాణీకులు మునుపటి మాదిరిగా తిరిగివచ్చే వరకు పరిశ్రమ పూర్తిగా పుంజుకోదని అధికారులు అంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు న్యూయార్క్‌ను సురక్షిత గమ్యస్థానంగా ఉంచడంపై నగర, రాష్ట్ర నేతలు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Telugu York, Yorkcitys, Pre Pandemic, Tourism-Telugu NRI

నగర వార్షిక సందర్శకులలో అంతర్జాతీయ టూరిస్టుల వాటా 20 శాతంగా ఉంది.అయితే 2020లో అనేక దేశాలపై ప్రయాణ పరిమితులు ప్రభావం చూపడంతో వారి సంఖ్య 82.2 శాతం నుంచి 4 మిలియన్లకు పడిపోయింది.కోవిడ్ పుట్టినిల్లు చైనా నుంచి కూడా పర్యాటకుల సంఖ్య తగ్గింది.ఇది గతేడాది 11.6 మిలియన్లకు పుంజుకున్నప్పటికీ.కరోనాకు ముందు (14.2) కంటే తగ్గింది.అయితే దేశీయంగా మాత్రం న్యూయార్క్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది.గతేడాది 50.6 మిలియన్ల మంది న్యూయార్క్‌ను సందర్శించారు.ఇది 2022 కంటే 7 శాతం ఎక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube