నటుడిగా ఎన్టీఆర్ ను ఎంతో అభిమానిస్తా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) అద్భుతమైన నటుడు అని తన నటనతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో మెప్పిస్తారని చాలామంది భావిస్తారు.ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తన అభిమాన తారలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని విరాట్ కోహ్లీ( Virat Kohli ) చెప్పుకొచ్చారు.

 Virat Kohli Interesting Comments Details Here Goes Viral In Social Media , Soci-TeluguStop.com

టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితుడు అని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.

నటుడిగా తారక్ ను ఎంతో అభిమానిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక యాడ్ లో నటించానని విరాట్ కోహ్లీ కామెంట్లు చేశారు.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఫిదా ఆయ్యానని కోహ్లీ పేర్కొన్నారు.

ఆప్యాయంగా మాట్లాడే జూనియర్ ఎన్టీఆర్ తీరు నచ్చుతుందని ఆయన అన్నారు.ఆర్.

ఆర్.ఆర్( R.R.R ) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి వర్ణించడానికి నాకు మాటలు సరిపోవని కోహ్లీ చెప్పుకొచ్చారు.

Telugu Anushka, Virat Kohli-Movie

నాటు నాటు డాన్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకుందని విరాట్ తెలిపారు.అనుష్కతో( Anushka ) కలిసి నాటు నాటు డాన్స్ స్టెప్స్ వేస్తూ చాలా రీల్స్ చేశానని ఆయన వెల్లడించారు.గతేడాది ఒక మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఈ సినిమాకు ఆస్కార్ వచ్చినట్టు తెలిసిందని ఆ సమయంలో మైదానంలో నాటు నాటు స్టెప్పులు వేసి నా సంతోషం వ్యక్తం చేశానని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.

Telugu Anushka, Virat Kohli-Movie

ప్రత్యేక సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ కు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటానని విరాట్ కోహ్లీ వెల్లడించడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా దేవర సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది.జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube