‘Nani31’లో ఆ స్టార్.. విలన్ రోల్ కోసం ఎంపిక.. ఎవరంటే?

న్యాచురల్ స్టార్ నాని ( Nani ) తన నెక్స్ట్ కోసం ఇంట్రెస్టింగ్ లైనప్ ను సెట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న నాని సినిమా నుండి అఫిషియల్ అప్డేట్ అయితే వచ్చింది.

 Sj Suryah To Play Negative Role In Nani 31-TeluguStop.com

నాని కెరీర్ లో 31వ సినిమాను నిన్న ప్రకటించారు.అది కూడా నానికి ఇప్పటికే ఒక ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నాని కెరీర్ లోనే ‘దసరా’ ( ‘Dussehra’ )సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.మరి ఈ సినిమాతో ఈయన క్రేజ్ కూడా పెరగడంతో ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు.ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ ( Hi Nanna ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో ఈ ఏడాది డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమా చేస్తూనే మరో సినిమాను నిన్న అఫిషియల్ గా అనౌన్స్ చేసాడు.

వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా లాంచింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 24న విజయదశమి రోజున లాంచ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్ జె సూర్య ( SJ Suryah ) విలన్ రోల్ లో నటించనున్నట్టు టాక్ వస్తుంది.తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.అంతేకాదు ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube