ఆ నిర్మాత అవమానించిన తీరుకు దాసరి నారాయణరావు కళ్ల వెంట నీళ్లు..??

దర్శకరత్న దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు మొదట రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు, దాదాపు 250 చిత్రాలకు మాటల రచయితగా పనిచేసి విశేషమైన సేవలు అందించాడు.

 Why Producer Insulted Dasari , Dasari Narayana Rao, Pratap Arts Productions, Ap-TeluguStop.com

అయితే దాసరి నారాయణరావు ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్( Pratap Arts Productions ) అధినేత కె.రాఘవ, ‘తాత మనవడు’ చిత్రం ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేశారు.తనపై నమ్మకం ఉంచి తనను దర్శకుడిని చేసిన నిర్మాత రాఘవ అంటే దాసరి నారాయణరావుకు ఎంతో గౌరవం, అభిమానం ఉండేది.

అయితే తూర్పు పడమర సినిమా తీస్తున్న సమయంలో రాఘవ, దాసరి నారాయణరావు మధ్య విభేదాలు తలెత్తాయి.

వీరిద్దరూ తలుచుకుంటే చిన్నపాటి మనస్పర్ధలను తొలగించుకొని మళ్ళీ మంచి ఫ్రెండ్స్ కాగలరు కానీ అలా జరగలేదు వారి మధ్య గొడవలు అనేవి బాగా పెరిగాయే తప్ప తగ్గలేదు.మొదట వీరి మధ్య ఎందుకు గొడవ జరిగిందో తెలుసుకుంటే, తూర్పు పడమర సినిమా అనేది తమిళ చిత్రం అపూర్వ రాగంగల్( Apoorva Ragangal ) (1975)కి రీమేక్.

ఇందులో కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధ నటించగా, నగేష్, రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Telugu Dasari Yana Rao, Raghava, Pratap, Dasari-Telugu Top Posts

అయితే తూర్పు పడమర నిర్మాత అయిన రాఘవ తెలుగు వెర్షన్ లో కూడా కమల్ హాసన్, రజనీకాంత్‌లను తీసుకుందామని చెప్పారు.అలానే కొన్ని సన్నివేశాలను ఉన్నది ఉన్నట్లు తెలుగు వెర్షన్‌లో వాడేద్దామని చెప్పారు.కానీ దాసరి అందుకు ఒప్పుకోలేదు.

తమిళ సినిమాలోని సన్నివేశాలను నటీనటులను తెలుగులో కూడా చూపిస్తే ఇక దానిని తెలుగులో తీసి ఏం లాభం? దానికి బదులు తమిళ సినిమాని డబ్ చేస్తే సరిపోతుంది కదా అని నిర్మొహమాటంగా చెప్పాడట.దాంతో సదరు ప్రొడ్యూసర్ బాగా ఆగ్రహానికి గురయ్యాడట.

ప్రొడ్యూసర్ కోపం తెచ్చుకున్నా దాసరి మాత్రం ఏమాత్రం తగ్గకుండా తనకు నచ్చినట్లుగానే సినిమా రూపొందించారు.తన సొంతంగా తెలుగు వెర్షన్‌కు కొన్ని మెరుగులు దిద్ది రిలీజ్ చేశారు.

ఇందులో నరసింహరాజు, శ్రీవిద్య, మాధవి, కైకాల సత్యనారాయణలను ప్రధాన పాత్రల్లో నటింపజేశారు.

Telugu Dasari Yana Rao, Raghava, Pratap, Dasari-Telugu Top Posts

ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.రాఘవకు బాగానే లాభాలు వచ్చాయి కానీ ఆయన మాత్రం సంతోషించలేదు.దాసరిపై ఇంకా కోపం పెంచేసుకున్నారు.

అందువల్ల తూర్పు పడమర సినిమా పోస్టర్లలో దర్శకుడు పేరు “దాసరి నారాయణరావు” అని రాయకుండా ఆఫీస్ బాయ్ గోపాల్ అని ప్రచురించారు.వాటిని చాలా చోట్ల అతికించారు.అయితే ఇది దాసరి దృష్టికి వచ్చింది.“దర్శకుడు పేరును ఆఫీస్ బాయ్ గోపాల్‌గా ప్రచురించడం ఏంటి?” అని ఆయన రాఘవ నిలదీశారు.“మంచిగా సినిమా తీసి ఇదేనా మీరు నాకు చూపించే గౌరవం” అంటూ ఫైర్ అయ్యారు.రాఘవ కూడా ఎదురు సమాధానం చెప్పడంతో వీరి మధ్య బాగా గొడవ జరిగిందట.

చివరికి ఇరువురు మళ్లీ కలవలేనంత దూరం అయిపోయారు.రాఘవ మంచి కోరి మంచిగా సినిమా తీస్తే అవమానమే ఎదురయిందనే కారణంగా దాసరి దాదాపు కంటనీళ్లు పెట్టుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube