పునీత్ రాజ్ కుమార్. కన్నడలో స్టార్ హీరో.
ఎన్నో చక్కటి సినిమాల్లో నటించిన వ్యక్తి.కమర్షియల్ సినిమాలే కాదు.
సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల్లోనూ ఆయన నటించాడు.సుమారు 29 సినిమాల్లో నటించిన ఆయన వరుసగా 10 సినిమాల్లో హిట్ కొట్టి తన తండ్రి, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ రికార్డును తిరగరాశాడు.
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.తాజాగా ఆయన గుండెపోటుతో కన్నుమూశాడు.
ఆయన మరణం పట్ల దేశ వ్యాప్తంగా అశ్రునయనాలతో శ్రద్ధాంజలి చెప్తున్నారు జనాలు.
పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ నటుడు అయినప్పటికీ.
మిగతా భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమతో ఆయనకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న పలు సినిమాలను ఆయన కన్నడలోకి రీమేక్ చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు.తెలుగు సినిమా నటులు ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజతో ఆయనకు ఎంతో మంచి స్నేహం ఉంది.
తాజాగా పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించిన పవర్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టారో మహేష్ బాబు అతిథిగా హాజరయ్యారు.

అటు రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, సూర్య వంటి నటులతో కూడా పునీత్ కు మంచి స్నేహం ఉంది.అటు పునీత్ కోరిక మేరకు ఆయన సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు.పునీత్ నటించిన చక్రవ్యూహ సినిమాలో జూనియర్ ఈ పాట పాడాడు.

2016 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఎన్టీఆర్ పాడిన పాట కూడా కన్నడ జనాలను బాగా ఆకట్టుకుంది.అటు ఇదే సినిమాలో పునీత్ తో కలిసి హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఓ పాట పాటింది.ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది.ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించాడు.అద్భుత మ్యూజిక్ తో జనాలను ఆకట్టుకున్నాడు.