బిగ్ బాస్. ఎంతో మంది సెలబ్రిటీలకు, అవుట్ డౌట్ అయిన సెలబ్రిటీలకు మళ్లీ ప్రాణం పోస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కొందరు మామూలుగా హౌస్ లోకి అడుగు పెట్టి జనాల్లో మంచి గుర్తింపు పొందిన వారు ఉన్నారు.మరికొందరు బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొని అపకీర్తి మూటగట్టుకున్న వాళ్లూ ఉన్నారు.
ఆయా సందర్భాల్లో హౌస్ లో ఆయా కంటెస్టెంట్లు ప్రవర్తించే తీరే జనాల్లో వారిపై రకరకాల అభిప్రాయాలు కలిగేలా చేస్తుంది.తాజాగా సీజన్ లో ఇండియన్ ఐడియల్ విన్నర్ శ్రీరామ్, యాంకర్ రవి మీద జనాలు ఎన్నో అభిప్రాయాలను కలిగి ఉన్నారు.
మంచి ఆట తీరుతో ఆకట్టుకుంటారు అనుకున్నారు కానీ.అందంతా ఉత్త ముచ్చటే అని తేలిపోయింది.
అటు తొలుత జనాలు సరిగా పట్టించుకోని సన్నీ ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యాడు.పోయిన్ సీజన్ షోలో సోహెల్ మాదిరిగానే ఈ ఏడాది సన్నీ మారిపోయాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది.
ప్రస్తుత సీజన్ లో సన్నీకి మంచి పాపులారిటీ వస్తోంది.ఆవేశంతో ఊగిపోయినా.ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు.గతంలో సోహెల్ కూడా ఇలాగే చేసేవాడు.
తన కోపాన్ని ఎంత మేరకు చూపించాలో.అంతే చూపిస్తున్నాడు సన్నీ.
ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలే ఆయనలో పాజిటివ్ నెస్ కలిగించేలా చేశాయి.జనాల్లో మంచి పేరు వచ్చేలా చేశాయి.
తాజాగా సీజన్ లో టాప్ 5 లిస్టులో సన్నీ తప్పకుండా ఉంటాడు అనే అభిప్రాయం జనాల్లో కలుగుతుంది.ఈ వారం షోలో చాలా మంది తనను టార్గెట్ చేసి గేమ్ ఆడారు.
అయినా తను ఒంటరిగానే ఆడాడు.దీంతో జనాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది.
కొందరు తనను రెచ్చగొట్టినా.అది తనకే ప్లస్ పాయింట్ అయ్యింది కూడా.
ఏది ఏమైనా ఈ సీజన్ లో సన్నీ చాలా ప్రత్యేకం అని చెప్పుకోక తప్పదు.ఎవరు తనను ఎంత టార్గెట్ చేసినా.తనకే లాభం కలుగుతుంది అనే అభిప్రాయానికి వచ్చారు జనాలు.పోయిన వారం ప్రియ వల్ల ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది.ఈవారం కూడా అది కలిసి వచ్చింది.ఈవారం తను ఎలిమినేషన్ లిస్టులో ఉన్నా.
హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం చాలా తక్కువ అనే టాక్ వస్తుంది.ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు బిగ్ బిస్ చూడాల్సిందే.