కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు వల్ల చనిపోయిన సంగతి తెలిసిందే.అయితే ఎంతో ఫిట్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావడంతో రోజూ వ్యాయామం చేసేవాళ్లు సైతం కంగారు పడుతున్నారు.
ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని శాస్త్రవేత్తల పరిశోధనలలో వెల్లడవుతోంది.అయితే పునీత్ మృతి చెందడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
గురువారం రాత్రి నుంచే పునీత్ కు ఆరోగ్యం సరిగ్గా లేదని అయినప్పటికీ శుక్రవారం రోజున ఆయన జిమ్ కు వెళ్లారని నలతగా ఉన్నా వ్యాయామాలు చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని వైద్యులు తెలిపారు.పునీత్ చేసిన హెవీ వర్కౌట్ల వల్ల తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు.
గుండెకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయని అనిపిస్తే వెంటనే రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారు.
గుండెపై అదనపు భారం పడటం వల్ల ఈ విధంగా జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.వ్యాయామం, రన్నింగ్ వల్ల గుండెపై భారం పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు.ఆరోగ్యంగా లేకపోతే జిమ్ కు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాయామంపై ఆసక్తి ఉన్నవాళ్లు సైతం వైద్యుల సలహాలు, సూచనలను పాటిస్తూ పరీక్షలు చేయించుకుని గుండె ఆరోగ్యంగా ఉంటే మాత్రమే హెవీ వర్కౌట్లు చేయాలి.
జిమ్ ట్రైనర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ మాత్రమే వ్యాయామాలు చేయడం మంచిదని చెప్పవచ్చు.వ్యాయామాలు చేసే సమయంలో చేసే తప్పుల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి.పునీత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మానవత్వం ఉన్న మంచి వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.