బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ.సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నవాజుద్దీన్ కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లో నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.ఇలా వెండితెరపై వెబ్ సిరీస్ లో దూసుకుపోతున్న ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
మొదట్లో నవాజుద్దీన్ ఓటీటీలలో నటించడానికి ఎంతో ఆతృత కనపరచారు.అయితే ప్రస్తుతం ఓటీటీలో వచ్చే కంటెంట్ చాలా అసహ్యంగా ఉంటుందని, కంటెంట్ కంటే బూతులే ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి సిరీస్లలో నటించడం తనకు నచ్చలేదని ఈ సందర్భంగా మరొక సారి వెబ్ సిరీస్ లో నటించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్వయంగా నవాజుద్దీన్ వెల్లడించారు.
ఒకప్పుడు వెబ్ సిరీస్ అంటే అందరూ ఎంతో ఆత్రుతగా చూసేవారని, ప్రస్తుతం వెబ్ సిరీస్ అంటే బూతు పురాణం గా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అందుకోసమే ఇకపై తాను కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కావాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా నవాజుద్దీన్ వెల్లడించారు.అదేవిధంగా పలు ఓటీటీ సంస్థలు వెబ్ కంటెంట్ పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నటుడు నవాజుద్దీన్ పేర్కొన్నారు.