టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఇలియానా తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నా దర్శకనిర్మాతలు ఆమెను పట్టించుకోవడం లేదు.సీనియర్ హీరోలకు జోడీగా నటించే ఆఫర్లు కూడా ఆమెకు దక్కడం లేదు.
బాలీవుడ్ లో ఇలియానాకు అడపాదడపా ఆఫర్లు వస్తున్నా అక్కడ ఆమె కెరీర్ మళ్లీ పుంజుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇలియానా తెగ యాక్టివ్ గా ఉంటున్నారు.
తాజాగా ఇలియానా వంట చేయాలని కూరగాయలు తరుగుతుంటే వేలు తెగిందని చెప్పుకొచ్చారు.కత్తి షార్ప్ గా ఉండటంతో ఇలా జరిగిందని ఆమె కామెంట్లు చేశారు.కత్తి వల్ల రెండు వేళ్లకు గాయాలయ్యానని తాను చిన్నపిల్లలా ఏడ్చానని ఇలియానా పేర్కొన్నారు.గాయం అయితే ఏడవడానికి ఏ మాత్రం సిగ్గు పడకూడదని ఇలియానా వెల్లడించారు.ఒక చేతితో మరో చేతివేళ్లకు బ్యాండేజ్ వేయడం తేలికైన పని కాదని ఇలియానా పేర్కొన్నారు.
ఇలియానా ఏడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
వంట చేసే సమయంలో గాయాలు కావడం ఇదే తొలిసారి కాదని గతంలో కూడా తనకు గాయాలు అయ్యాయని ఇలియానా వెల్లడించారు.అయితే అన్ని గాయాలు అయినా ఇంకా తనకు వేళ్లు ఉండటం ఆశ్చర్యకరం అని ఇలియానా పేర్కొన్నారు.
మరోవైపు ఒక ఫ్యాన్ పెళ్లి గురించి అడగగా ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని అయితే పెళ్లి చేసుకోవడానికి వరుడు దొరకడం లేదని ఇలియానా పేర్కొన్నారు.దాదాపుగా 15 సంవత్సరాల పాటు వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఇలియానాకు 2018 సంవత్సరం తర్వాత నుంచి ఆఫర్లు తగ్గాయి.వచ్చే ఏడాదైనా ఇలియానా బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.