దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతుంటారు ఆర్మీ జవాన్స్.కుటుంబాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తారు జవాన్స్.కాని ప్రతి వారికి ఒక అంతర్గతంగా టాలెంట్ ఉంటుంది.దానిని కెరియర్ తీసుకునే అవకాశం రాకున్నా ఎక్కడో ఒక చోట అవకాశం ఉన్నప్పుడు తమ టాలెంట్ ని ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఉంటారు.
అలా ఓ జవాన్ ఎంతో అద్భుతంగా డ్రమ్స్ వాయిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.సామ్ డానియల్స్ అనే సైనికుడు ఎంతో అద్భుతంగా మిగతా జవాన్ల ముందు వాయించాడు.
అచ్చం ఓ అసలు సిసలు ఓ ప్రొఫెషనల్ డ్రమ్మర్ వాయించినట్లుగా వాయించడంతో అక్కడ ఉన్న జవాన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ వీడియోను సోర్జర్ థాన్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నరేంద్ర మోడీ గారు ఇతనిని ఫేమస్ చేయగలరా అని క్యాప్షన్ పెట్టారు.ఏది ఏమైనా మనలో ఉన్న టాలెంట్ ను ప్రదర్శించుకునే అవకాశం వస్తే ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశం ఉంటుంది.
కాబట్టి మనలో ఉన్న టాలెంట్ మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది.