కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది.ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడికి సరిసమానంగా పనిచేస్తూ ఎంతో మందికి అన్ని విధాలా సహాయపడుతోంది.
పరిశోధకులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీకి కొన్ని మెరుగులు దిద్ది దానిని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వినియోగించాలని ప్రయత్నిస్తున్నారు.ముఖ్యంగా కార్లలో ప్రయాణించే ప్రజల భద్రత విషయంలో మరిన్ని సేఫ్టీ ప్రమాణాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
చిత్రలహరి సినిమాలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.స్థానిక పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లకు సమాచారం దానంతటదే ఎలా అందుతుందో.అందుకు కార్లో ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారో కళ్ళకు కట్టినట్టు చూపించారు.అచ్చం అదే తరహాలో ఇప్పుడు ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కొత్త టెక్నాలజీని తీసుకురావడానికి సైంటిస్ట్ లు నడుంబిగించారు.
అయితే ఈ టెక్నాలజీకి మరిన్ని ప్రత్యేకతలున్నాయి.ఇందులో అమర్చే కొన్ని కెమెరా సెన్సార్లు డ్రైవర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తాయి.
ఒకవేళ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయినట్లు సెన్సార్లు గమనిస్తే వెంటనే అలర్ట్ చేస్తాయి.
జపాన్‌కి చెందిన వాహనాల తయారీదారు మజ్దా భారతదేశానికి చెందిన స్వరాజ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ కంపెనీ గతంలో పలు వాహనాలను ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేసింది.అయితే ఇప్పుడు ఆ కంపెనీ ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త కారుని రూపొందిస్తోంది.ఈ కారుకి ప్రమాదాలు జరిగితే వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు, ఆస్పత్రిలకు మెసేజ్ అందేలా కొత్త టెక్నాలజీ తయారు చేస్తోంది.ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దాని తీవ్రతను తగ్గించేందుకు ఇందులో ఉండే ఆటో పైలెట్ మోడ్ కూడా అందిస్తున్నారు.
ఈ ఆటో మోడ్ అనేది ప్రమాదం జరిగిన వెంటనే యాక్టివేట్ అయిపోయి కారు వేగాన్ని తగ్గించి సురక్షితంగా రోడ్డు పక్కన ఆగేలా చేస్తుంది.

అంతేకాదు, డ్రైవర్ కు గుండె పోటు వంటి ఆకస్మిక అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు.కెమెరా సెన్సార్లు గుర్తించి ఆటో మోడ్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తాయి.దీని వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు.
ఆటో మోడ్ తన పని తాను చేసుకుంటూ ఉన్న సమయంలోనే.ఈ కెమెరాలు అంబులెన్స్, హస్పిటల్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ మెజేస్ పంపిస్తాయి.
అయితే కెమెరాల ఆధారంగా మనిషి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేందుకు మజ్ధా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులతో టెక్నాలజీని రూపొందిస్తోంది.అయితే ఈ టెక్నాలజీ కార్లు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీని ధర కోటి రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.