పైకి బాగానే ఉన్నట్టు గా కనిపించినా, అంతర్గతంగా టిడిపి తీవ్ర ఒత్తిడితో ఉంది.2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రభావంతో పార్టీ క్యాడర్ కూడా తీవ్ర నిరాశా నిస్పృహల్లో కి వెళ్ళిపోయింది.ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం తోనే ఈ ఫలితాలు ఇంత ఘోరంగా వచ్చాయనే విషయం బాబుకి సైతం బాగా అర్థం అయింది.అందుకే 2019 తరహా ఫలితాలు మళ్లీ పునరావృతం కాకూడదు అంటే జనసేన, బీజేపీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే ఏకైక మార్గంగా చంద్రబాబు ఫిక్స్ అయిపోయార.
జనసేన తో పొత్తు పెట్టుకునే విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమి టిడిపికి లేదు. ఎందుకంటే జనసేన ప్రధాన ప్రత్యర్థి కూడా వైసిపి కావడంతో , ఆ పార్టీని ఓడించేందుకు తప్పనిసరిగా జనసేన సహకారం తీసుకుంటుందని టిడిపి అభిప్రాయపడుతోంది.
అలాగే సొంతంగా జనసేన ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చే అంత ఛాన్స్ కూడా లేకపోవడంతో , తమతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకుంటారు అనేది చంద్రబాబు అంచనా.కాకపోతే అసలు ఇబ్బంది అంతా బిజెపితోనే.
బిజెపి, జనసేన, టిడిపి కాంబినేషన్ లో ఎన్నికలకు వెళ్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటంతో ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తమకు అవకాశం ఏర్పడుతుందని, అందుకే ఏదో రకంగా బిజెపితో పొత్తు కు ఒప్పించాలని రకరకాలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే బిజెపి మాత్రం దూరం పెడుతూనే వస్తోంది.

ముఖ్యంగా ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ థియేధర్ సైతం టీడీపీ తో పొత్తు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండదు.బాబు ఇక తమతో పొత్తు సంగతి మర్చిపోవాలి అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.తాము చెబితే పార్టీ హైకమాండ్ చెప్పినట్లేనని, పార్టీ అధిష్టానం అభిప్రాయాన్ని తాము వెల్లడిస్తామని సునీల్ దియోధర్ ఇటీవలే ప్రకటించేశారు.

అంతేకాదు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కి మద్దతుగా టిడిపి పరోక్షంగా సహకారం అందించినా సునీల్ దియోధర్ మాత్రం దానిని ఒప్పుకోవడం లేదు.ఈ ఎన్నికల్లో టిడిపి ఓట్లు తమకు పడలేదని, ఆ పార్టీ ఓట్లు అన్నీ కాంగ్రెస్ కు వెళ్లాయని చెప్పి బాబుని మరింత ఇరిటేషన్ కు గురిచేశారు.టిడిపి కి కౌంటర్ ఇచ్చేందుకు సునీల్ ధియోధర్ ఎప్పుడూ సిద్ధంగా ఉండటం, అసలు టిడిపి బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు రెండు వందల శాతం కూడా ఛాన్స్ లేదు అంటూ మరింత టెన్షన్ టీడీపీ ని పెడుతున్నారు.
బిజెపి తో పొత్తుకు ప్రయత్నిస్తున్న ప్రతిసారీ సునీల్ ధియోదర్ అడ్డంకి గా మారారు.
.