సమాజానికి మంచి చేయాలనే జనసేన పార్టీని స్థాపించామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.అంతేకాని పదవుల కోసం కాదన్నారు.
ఒకవేళ పదవుల కోసమే అయితే పార్టీలోకి రావొద్దని వ్యాఖ్యనించారు.పదవులు మనల్ని వెతుక్కుంటూ రావాలి కానీ, వాటి కోసం మనం పాకులాడొద్దని పేర్కొన్నారు.
అదేవిధంగా విలువలు లేని వ్యక్తులతో పార్టీని నడిపితే విచ్ఛిన్నానికి దారి తీస్తోందన్నారు.మళ్లీ అధికారంలోకి రావడానికి వైసీపీ చూస్తోందన్న జనసేనాని.
స్పాంజి స్కీమ్ ను అమలు చేస్తుందని విమర్శించారు.స్పాంజి స్కీమ్ అంటే అది ఇస్తాం.
ఇది ఇస్తామంటూ ప్రజల్ని మోసం చేయడమేనని వెల్లడించారు.