పాములంటే నూటికి 90 మంది భయపడతారు.ఎడారుల నుండి అడవుల వరకు అన్ని చోట్లా పాములు కనిపిస్తాయి.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో విషపూరితమైన నాగుపాముల రక్తాన్ని తాగే విచిత్రమైన ఆచారం ఉంది.టీ, కాఫీల మాదిరిగా పాము రక్తాన్ని తాగే ఏకైక ప్రదేశం ఇదే.ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి నాగుపాము రక్తాన్ని తాగుతారు.మహిళలు తమ చర్మాన్ని ఆకర్షణీయంగా ఉంచుకునేందుకు నాగుపాము రక్తాన్ని తాగుతారు.
నాగుపాము రక్తం తాగడం వల్ల చర్మానికి మెరుపుదనం వస్తుందని వారు నమ్ముతారు.జకార్తాలోని పలు ప్రాంతాలలో నాగుపాము రక్తాన్ని విక్రయిస్తారు.సాయంత్రం వాకింగ్ చేస్తున్నప్పుడు దానిని సిప్ చేసుకుంటూ తాగుతారు.పాము రక్తం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, దుకాణదారులు ప్రతిరోజూ వేలాది పాములను చంపేస్తున్నారు.
ఈ దుకాణాలు సాయంత్రం 5 గంటలకు తెరిచి పొద్దుపోయే వరకూ ఉంచుతారు.
నాగుపాము రక్తం తాగిన తర్వాత 3-4 గంటల వరకు టీ కాఫీలు తాగకూడదని వీరు చెబుతారు.
సైన్యంలో పనిచేసే సైనికులకు ప్రత్యేకంగా ఈ రక్తాన్ని ఇస్తారు.ఆర్మీ సైనికులు నాగు పామును పట్టుకుని, దాని రక్తం తాగడంలో శిక్షణ పొందుతారు.
తద్వారా అనుకూల పరిస్థితుల్లోనూ దాహంతో చనిపోరని నమ్ముతారు.