క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పుష్ప2( Pushpa 2 ) కాగా 2021 లో విడుదల అయిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ లుక్స్ కి ప్రేక్షకులకు నుంచి భారీగా స్పందన లభించింది.అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్,పోస్టర్ లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ కి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అదేమిటంటే ఈ సినిమాలో స్టార్ నటుడు అయినా జగపతి బాబు ( Jagapathi babu, )నటించబోతున్నారట.
ఇదే విషయాన్ని జగపతిబాబు స్వయంగా చెప్పుకొచ్చారు.తాజాగా జగపతి బాబు, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీకా జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ సుకుమార్( Sukumar ) తో కలిసి పనిచేయడం నాకు ఎప్పుడూ ఎక్సైటింగ్ గా ఉంటుంది.పుష్ప2 సినిమాలో నా పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంది.నాకు ఇలాంటి పాత్రలు అంటేనే ఇష్టం.
అందులోను సుకుమార్ నాకు ఎప్పుడు మంచి మంచి క్యారెక్టర్లే ఇస్తాడు.అతడితో కలిసి వర్క్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను అని చెప్పుకొచ్చాడు జగపతి బాబు.
కాగా మొదట హీరోగా కెరియర్ ను మొదలుపెట్టిన జగపతిబాబు ఆ తర్వాత నటుడిగా మారి తర్వాత విలన్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం వరుసగా సినిమాలలో విలన్ గా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.