గంటలోనే జగనన్న హామీ పరిష్కారం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.మాట తప్పను.

 Jagananna Guaranteed Solution Within An Hour , Bhimavaram , Ap Cm Ys Jagan ,-TeluguStop.com

మడమ తిప్పనని చెప్పే జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారనే చెప్పుకోవచ్చు.ఏదైనా అనుకుంటే చేసి తీరే ఆయన నైజమే ప్రజల్లో అభిమానాన్ని పెంచింది.

గత కొన్ని రోజులుగా ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణను రూపొందించుకుంటూ జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.పర్యటనలో భాగంగా సీఎం జగన్ కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి.

ప్రజల నుంచి వినతులు వింటున్న సీఎం జగన్ గంటల వ్యవధిలోనే పరిష్కార మార్గాలను చూపిస్తూ తన మార్క్ ను మరోసారి వేస్తున్నారు.

భీమవరం( Bhimavaram )లో పర్యటించిన సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలోనే పరిష్కారం చూపారు.

తొమ్మిది మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు అందించారు.ఈ మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో తొమ్మిది మంది అర్జిదారులకు చెక్కులను కలెక్టర్ పి.ప్రశాంతి అందజేశారు.సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భీమవరం పరిరక్షణ సందర్భంగా సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి( P Prasanthi )ని ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే అర్జిదారులకు రూ.లక్ష చొప్పున చెక్కులను జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డితో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు.

ఆ క్రమంలోనే సీఎం జగన్ ను కలిసిన వారికి చెక్కులను అందజేశామని తెలిపారు.

Telugu Ap Cm Ys Jagan, Ap, Bhimavaram, Eluru, Jagan, Prasanthi, Solve Problems-L

చెక్కులు అందుకున్న అర్జిదారుల వివరాలు.:

– కడలి నాగలక్ష్మీ, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.భూ పరిష్కారంలో పరిహారం అందించారు.

– ఎల్లమల్లి అన్నపూర్ణ, 29 వ వార్డు నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.భర్త చనిపోయారు.

వారికి ఆర్థిక సాయం అందజేశారు.

– చిల్లి సుమతి, బోడ్డిపట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా.

బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సాయం

– కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగవెంకట రవితేజ, శ్రీరామ వరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా.వైద్య సాయం నిమిత్తం.

– తేతలి గీత, వైఫ్ /ఆఫ్ లేట్ టి ఎన్ ఎన్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు జిల్లా.భర్త మరణించడంతో ఆర్థికసాయం.

– అరుగుల లాజరన్, పూళ్ల గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా.కుమారునికి వైద్య సహాయం నిమిత్తం.

– అందుగుల లాజర్, పూళ్ల గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా.కుమారినికి వైద్య సహాయం నిమిత్తం.

– గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతిపురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా.వైద్య సహాయం నిమిత్తం.

– కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.వైద్య ఖర్చులు నిమిత్తం సాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube