Rocking Rakesh : భార్యను చూస్తే బలిచ్చే కోడిలా అనిపించింది… సుజాత పై రాకేష్ షాకింగ్ కామెంట్స్?

జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) ఒకరు.ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇకపోతే హీరోగా కూడా సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

 Jabardasth Comedian Raking Rakesh Shocking Comments On Wife Sujatha Tollywood-TeluguStop.com

ఈయన కేసీఆర్ అనే సినిమాని సొంతంగా నిర్మించబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా రాకింగ్ రాకేష్ మరొక నటి జోర్దార్ సుజాతను ( Sujatha )పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.జోర్దార్ వార్తల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుజాత అనంతరం బిగ్ బాస్ అవకాశం అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ స్కిట్ లో సందడి చేశారు.ఇలా రాకింగ్ రాకేష్ స్కిట్ లో చేస్తూ ఆయనతో ప్రేమలో పడి చివరికి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాకేష్( Rocking Rakesh ) తన ప్రేమ గురించి పలు విషయాలు తెలియజేశారు.సుజాత నన్ను ప్రేమిస్తుంది అనే విషయం తెలియగానే ఇదేంటి బలిచ్చే కోడీలా నా ప్రేమలో పడింది అంటూ తనకు అనిపించిందని రాకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

మంచి జాబ్ చేసుకుని నెలకు లక్షల్లో జీతం తీసుకునే అబ్బాయిలను పెళ్లి చేసుకోకుండా తను నా ప్రేమలో పడి ఇలా బలిచ్చే కోడి లాగా తయారయింది అనుకున్నాను అంటూ రాకేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే రాకేష్ ఇతరుల పట్ల చూపించే ప్రేమ గౌరవం కేరింగ్ కారణంగానే తాను రాకేష్ ప్రేమలో పడిపోయాను అంటూ ఇదివరకు సుజాత పలు సందర్భాలలో తెలిపారు.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.సుజాత మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక కెరియర్ పరంగా కూడా ఈమె ఎంతో బిజీ అయ్యారు.

ప్రస్తుతం ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే మరోవైపు సినిమా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.అలాగే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.ఇక తన భర్త హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నటువంటి తరుణంలో తన భర్త సినిమాకి కూడా ఈమె ఎంతో చేదోడువాదోడుగా నిలబడ్డారని చెప్పాలి.

ఇక తన కోడలు గురించి రాకేష్ తల్లి మాట్లాడుతూ మొదట్లో సుజాతాన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం తెలియడంతో కాస్త నేను భయపడ్డాను.ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చి ఇక్కడ అలవాటు పడగలదా మాతో కలిసి పోగలదా అనే భయం నాలో ఉండేదని ఆమె తెలియజేశారు.

అయితే ఇప్పుడు మాత్రం తను మా ఇంట్లో ఒక చిన్న పిల్లలాగా మారిపోయిందని తెలిపారు.పెళ్లి తర్వాత సుజాత అల్లరి మరింత పెరిగిపోయింది అంటూ ఈ సందర్భంగా తన కోడలు గురించి రాకేష్ తల్లి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=3324949291093464
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube