చాలా రోజులుగా తెలంగాణ కాంగ్రెస్( Congress ) లో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తారనే హడావుడి జరుగుతోంది.ముందుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు షర్మిల ప్రయత్నించినా, పొత్తు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నో చెప్పారు.
దీనికి కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడే కారణం .పోత్తు కాకుండా విలీనం చేయాలనే షరతులు కాంగ్రెస్ విధించడంతో షర్మిల దానికి అంగీకరించారు.అయితే అక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.తెలంగాణ రాజకీయాల్లో కాకుండా , ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటూ షర్మిలకు( Ys sharmila ) సూచించింది.అయితే తాను తెలంగాణ బిడ్డనని, తెలంగాణ కోడల్ని అంటూ ప్రచారం చేసుకున్న షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెడితే అనేక విమర్శలు వస్తాయనే ఆలోచనతో చాలా రోజులుగా దీనిపై సైలెంట్ గాని ఉన్నారు.
![Telugu Ap Congress Ap, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics Telugu Ap Congress Ap, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/ysrtp-Congress-BJP-BRS-Telangana-government-KCR-ap-Congress-ap-elections.jpg)
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని తెలంగాణ రాజకీయాల్లోనే తాడోపేడో తేల్చుకునేందుకు నిర్ణయించుకున్న షర్మిల తన నిర్ణయాన్ని కాంగ్రెస్ పెద్దలకు చేరవేశారట .దీంతో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడితేనే విలీన ప్రతిపాదనకు అంగీకరిస్తామని , ఏపీలో కాంగ్రెస్ బలోపేతం చేసే విధంగా షర్మిల ప్రయత్నించాలని, గతంలో ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి డైవెర్ట్ కావడంతో ఇప్పుడు షర్మిల ద్వారా ఆ ఓటు బ్యాంకు ను వెనక్కి తీసుకురావాలని షరతులు పెట్టిందట .కానీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టిన షర్మిల ఏపీకి వెళ్లేందుకు ఏమాత్రం అంగీకరించకపోవడంతో విలీన ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం.
![Telugu Ap Congress Ap, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics Telugu Ap Congress Ap, Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Ys-sharmila-ysrtp-Congress-BJP-BRS-Telangana-government.jpg)
అంతేకాదు షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే గత కొంతకాలంగా షర్మిల పార్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా, ఆ పార్టీకి హైప్ వచ్చే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, షర్మిల చేస్తున్న విమర్శలు సీరియస్ గా తీసుకుని ఆమె ధర్మాలు, ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ప్రతి సందర్భంలో.ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, కావాలనే షర్మిలకు ప్రాధాన్యం పెంచి విపక్షాల ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా తాము ఘట్టెక్కాలని ఆలోచనతో కేసీఆర్ ( CM KCR )షర్మిల పార్టీని ప్రోత్సహిస్తున్నారని అనుమానాలు కాంగ్రెస్ లో నెలకొన్నాయి .అందుకే షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించి ఏపీకి పంపాలని చూసినా, షర్మిల దానికి నిరాకరిస్తుండడంతో పూర్తిగా పక్కన పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందట.
.