దేశవ్యాప్తంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు( Communist parties ) కాలానుగుణం గా తమ ప్రభను కోల్పోయాయి.ముఖ్యంగా పెట్టుబడిదారీ విధానాల వైపు గ్లోబలైజేషన్ దిశగా దేశం ముందుకు వెళ్లిపోవడంతో సమ సమాజ స్థాపన అంటూ కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చే నినాదాలు పోస్టర్లకే పరిమితం అయిపోయాయి .
అయినా కూడా కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాల్లో ఇప్పటికీ సత్తా చాటుతున్న కమ్యూనిస్టులు ఆయా నియోజకవర్గాలలో తమ ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

అయితే మారుతున్న రాజకీయ పరిస్థితులలో వాటిని కూడా హస్తగతం చేసుకునే విధంగా సాంప్రదాయ పార్టీలు దూకుడు ప్రదర్శించడంతో ఇప్పుడు తమ ఉనికిని నిలబెట్టుకోవటం ఈ పార్టీలకు అత్యంత ఆవశ్యకం గా మారిపోయింది.దాంతో పొత్తులు పెట్టుకొని అయినా సరే తమ ప్రభావాన్ని నిలబెట్టుకుందామని చూస్తున్నప్పటికీ పరిస్థితులు కలిసి రావడం లేదు.ఇంతకు ముందు అధికార పార్టీతో పొత్తు చర్చలు విఫలం అవ్వడంతో కాంగ్రెస్తో జత కట్టడానికి సిద్ధమైన సిపిఎం( CPM ) తమ కంచు కోటగా చెప్పుకోదగ్గ భద్రాచలం( Bhadrachalam ) సీటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడం తో చర్చలు నిలిచిపోయాయా దాంతో పాటు పాలేరుని కూడా ఇవ్వడానికి కాంగ్రెస్( Congress ) అంగీకరించక పోవడంతో , కాంగ్రెస్తో తేగతేంపులు చేసుకొని ఒంటరి పోరాటానికి తెరతీసింది.

దాంతో ఇప్పుడు భద్రాచలం లో ఎర్ర జెండా ఎగురుతుందా లేదా అన్నది ఆసక్తికరం గా మారింది .ఈ నియోజకవర్గం లో 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections) కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్యకు 47,446 ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకటరావు ( Tellam Venkatarao )కి 35,961 ఓట్లు వచ్చాయి .సిపిఎం అభ్యర్థి మిడియం బాబురావుకు 14,224 ఓట్లు వచ్చాయి.దాంతో సిపిఎం గెలవకపోయినా మరొకరి ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో అక్కడ ఉందన్నది ఖచ్చితమైన విషయం.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ని వదులుకోవడానికి కాంగ్రెస్ ఇష్టపడకపోవడంతో ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పనిసరి అయిపోయింది.ఇప్పుడు సిపిఎం నుంచి కారం పుల్లయ్య పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య పోటీ చేస్తున్నారు.
అధికార బారాసాన్నించి తెల్లా వెంకటరావుకు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.దాంతో ఇప్పుడు ఎవరు ఎవరి అవకాశాలను ప్రభావితం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది .ఏది ఏమైనా దశాబ్దాల పాటు కంచుకోటగా ఏలిన నియోజకవర్గంలో సిపిఎం మరోసారి తన వెలుగులను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి
.