ఇంటికొచ్చిన ఎల్పీజీ సిలిండర్ బరువు తక్కువగా ఉందా?.. ఇలా ఫిర్యాదు చేయండి

ఎల్‌పిజి సిలిండర్ తక్కువ బరువుతో డెలివరీ అయ్యిందని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు.మీరు సిలిండర్ డెలివరీ సమయంలో ఈ సందేహాన్ని క్లియర్ చేసుకోవచ్చు.

 Is The Lpg Cylinder Underweight Complain Like This, Lpg Cylinder, Underweight ,-TeluguStop.com

మీరు సిలిండర్ సీల్‌తో పాటు దాని బరువుపై కూడా దృష్టి పెట్టాలి.డెలివరీ బాయ్ దగ్గర ఉండే యంత్రం సహాయంతో సిలిండర్‌ను తూకం వేయించాలి.

ఖాళీ సిలిండర్‌లో ఎంత బరువు ఉంటుందో, గ్యాస్ నింపిన సిలిండర్ బరువు ఎంత ఉంటుందో చాలామందికి తెలియదు.ఇంటికి వచ్చే డొమెస్టిక్ సిలిండర్‌లో 14.2 కిలోల గ్యాస్ ఉంటుంది.ఖాళీ సిలిండర్ 15.3 కిలోల బరువు ఉంటుంది.

మీరు ఒక సిలిండర్‌ను తీసుకున్నప్పుడు, దాని పూర్తి బరువు 29.5 కిలోలు ఉండాలని గుర్తుంచుకోండి.దీని కన్నా తక్కువ బరువు ఉంటే సీల్డ్ సిలిండర్‌ను తీసుకునేందుకు నిరాకరించవచ్చు.

కస్టమర్ కేర్ సెల్‌ను సంప్రదించవచ్చు.ఇంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్ 1800-2333-555కి కాల్ చేయవచ్చు.

అలాగే గ్యాస్ కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా ఏజెన్సీలో ఫిర్యాదు చేయవచ్చు.కాగా మీరు దేశంలో ఎక్కడి నుంచి అయినా గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు.

దీని కోసం శాశ్వత చిరునామా పత్రం అవసరం లేదు.ఇప్పుడు మీరు ఒక ఐడీ రుజువు ఆధారంగా కనెక్షన్ తీసుకోవచ్చు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా ఎల్పీజీ కనెక్షన్లను మరింత సులభతరం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube