దళితులకు కాంగ్రెస్ గాలం వేస్తోందా ?

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress party )మచి జోష్ లో ఉంది.కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తెలంగాణలో కూడా అదే తరహా విజయాన్ని నమోదు చేయాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.

 Is The Congress Giving Trouble To The Dalits, Congress Party , Mallikarjun Kharg-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతోంది.ఇక వచ్చే నెల మొదటి వారంలో బరిలో నిలిచే తొలి జాబితా అభ్యర్థులను విడుదల చేసే అవకాశం ఉంది.

అయితే అంతకంటే ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా తెలంగాణలో 30 శాతం ఉన్న దళితులను ఆకర్శించేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Telugu Congress, Revanth Reddy, Sc St, Telangana-Latest News - Telugu

ఇందులో భాగంగానే తాజాగా చేవెళ్ళలో జరిగిన బహిరంగ సభలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్( SC ST Declaration ) కూడా విడుదల చేశారు.ఈ డిక్లరేషన్ లోని 12 అంశాలను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా నెరవేరుస్తామని చెబుతున్నారు హస్తం నేతలు.ప్రస్తుతం ఆ 12 సూత్రాలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.పది పాసైన దళిత గిరిజన విద్యార్థులకు 10 వేలు , ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పూర్తి చేస్తే15 వేలు అలాగే పీజీ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల నగదు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

Telugu Congress, Revanth Reddy, Sc St, Telangana-Latest News - Telugu

ఇక ఎస్సీ లకు 18 శాతం రిజర్వేషన్లు పెంచుతామని, ఎస్సీలలో ఏ, బి, సి, డి.వర్గీకరణకు చర్యలు చేపడతామని కాంగ్రెస్ ( Congress party )చెబుతోంది.అంతే కాకుండా ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూముల పునరుద్దరణ, పోటు పట్టాల పంపిణీ వంటివి కూడా డిక్లరేషన్ లో అంశాలుగా చేర్చింది.దీన్ని బట్టి చూస్తే ఎస్సీల విషయంలో కాంగ్రెస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది.

వీటితో పాటు కర్నాటకలో అమలౌతున్న ఆయా పథకాలు కూడా తెలంగాణలో అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే( Mallikarjun Kharge ) స్పష్టం చేశారు.అయితే దళితుల విషయంలో సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుందనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

మొత్తానికి దళిత గిరిజన ఓటు బ్యాంకు పై కాంగ్రెస్ వేస్తున్న వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube