మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటాం.ఫోన్‌లో ఏవైన జంక్ ఉంటే క్లీన్ చేస్తుంది.
హీట్ తగ్గించడానికి.లేదా స్పేస్ ఫ్రీఅప్ చేయడానికి ఈ యాప్‌ను వాడతాం.
కానీ, అసలు ఈ యాప్‌ను వాటడం కచ్చితమా? అన్న విషయం తెలుసుకుందాం.సాధారణంగా స్మార్ట్‌ఫో¯Œ లోని ఫైల్స్ కరప్ట్ కాకుండా, వైరస్ దాడి చేయకుండా, బ్యాంకింగ్ లావాదేవీలు చేసేవారు సైబర్ దాడులకు గురి కాకుండా యాంటీవైరస్ యాప్స్ కొంటూ ఉంటారు.
ఇప్పటి కే ఎన్నో కేసులు నమోదయ్యాయి.నమోదవుతూనే ఉన్నాయి సైబర్ నేరగాళ్లకు సంబంధించినవి.ఈ హ్యాకర్స్ తెలివిగా ఏదో ఓ లింక్ పంపిస్తారు.దాన్ని క్లిక్ చేయగానే మన స్మార్ట్ ఫోన్‌లో ఉన్న పర్సనల్ డేటా మొత్తం ఆ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
అయితే, మీ స్మార్ట్ ఫోన్‌లో మంచి యాంటీ వైరస్ యాప్ ఉంటే ఈ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.మామూలుగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా డిఫాల్ట్‌గా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లను అందిస్తూ ఉంటాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్ లో ఉండే ప్రీలోడెడ్ యాప్స్‌లో యాంటీవైరస్ యాప్ కూడా ఉంటుంది.మరి ప్రత్యేకంగా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడం అవసరమా? అన్న ప్రశ్న.స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యాంటీవైరస్ యాప్ కాకుండా మీరు ఇతర యాంటీవైరస్ యాప్ డౌన్ లోడ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు.మీ స్మార్ట్‌ఫోన్‌లో స్పేస్ నిండిపోతుంది.బ్యాటరీ కూడా త్వరగా ఖాళీ అవుతుంది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయితే, బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉంటుంది.ఇది బిల్ట్ ఇన్ మాల్‌వేర్ ప్రొటెక్షన్ అందిస్తుంది.గూగుల్ ప్రతీ నెలా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తూ ఉంటుంది.
సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటుంది.దీంతో నిత్యం కోట్లాది డివైజ్‌లను స్కాన్ చేస్తూ ఉంటుంది.
ఇది కేవలం ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసిన యాప్స్ మాత్రమే కాకుండా.థర్డ్ పార్టీ సర్వీసెస్‌ను కూడా స్కాన్ చేస్తుంది.

గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు డిఫాల్ట్‌గా యాంటీవైరస్ యాప్స్ ఇస్తాయి కాబట్టి ప్రత్యేకంగా యాంటీవైరస్ యాప్ అవసరం లేదన్నది చాలామంది వాదన.అయితే స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచించేవాళ్లు మాత్రం యాంటీవైరస్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటారు.అయితే, ఎవరి వాదన వారిది , అదనంగా థర్డ్ పార్టీ వారు మన స్మార్ట్ ఫోన్లలో లేని సేవలను అందిస్తే అప్పుడు పేయిడ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.