సాయి పల్లవిపై కరణ్ జోహార్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం అదేనా?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బాలీవుడ్ లో చేసే హంగామా అంతా ఇంతా కాదు అనే చెప్పాలి.ఈయన పార్టీలు బాలీవుడ్ లో చాలా ఫేమస్.

 Is Sai Pallavi Gracing Koffee With Karan , Koffee With Karan, Sai Pallavi, Kara-TeluguStop.com

ఎంత ఫేమస్ అంటే స్టార్ లు సైతం ఈయన పార్టీకి తరలి వస్తారు.ఇటీవల కూడా ఈయన తన 50వ పుట్టిన రోజును ఎంత ఘనంగా చేసారో తెలిసిందే.

ఇక ఇది పక్కన పెడితే ఈయన హోస్ట్ గా కూడా ఒక షో చేస్తూ ఉంటాడు.

ఈయన చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఈ షోను రెగ్యురల్ గా ఫాలో అవుతూ వారికీ నచ్చిన సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు చూస్తూ వారి గురించి తెలుసుకుంటూ ఈ షోను మరింత ఆదరిస్తున్నారు.అయితే ఈ షో సీజన్ 7 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.

ఇప్పటికే సమంత కు సంబంధించిన ఎపిసోడ్ ను షూట్ చేసారని వార్తలు వస్తున్నాయి.

మన సౌత్ హీరోయిన్ నుండి ఈసారి సమంత తో పాటు సాయి పల్లవి కూడా పాల్గొనబోతుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ సీజన్ కోసం ఇప్పటికే సెలెబ్రిటీల లిస్ట్ తయారు చేసారని అయినా కూడా కరణ్ జోహార్ ఈ లిస్టులో మార్పులు చేసారని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం.

జూన్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

అయితే అనూహ్యంగా ఈ సినిమా ట్రైలర్ పై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కామెంట్ చేసారు.ట్రైలర్ అద్భుతంగా టెర్రీప్క్ గా ఉందని తాను సాయి పల్లవికి వీరాభిమానిని అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.

అయితే ఈయన ఈ కామెంట్స్ చేయడం వెనుక మరొక కారణం ఉందట.

Telugu Bollywood, Karan Johar, Koffee Karan, Rana Daggubati, Sai Pallavi, Samant

రానా కరణ్ మధ్య మంచి స్నేహబంధం ఉంది.ఈ కారణంగానే విరాటపర్వం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈయన కాఫీ విత్ కరణ్ షోకు రానాతో పాటుగా సాయి పల్లవి ని కూడా ఆహ్వానించాడని ఆ కారణంగానే ఆయన సాయి పల్లవి పై అలాంటి ట్వీట్ చేసారని చెబుతున్నారు.మరి సాయి పల్లవి షోలో కనుక పాల్గొంటే మరో రేంజ్ కి రావడం ఖాయం.

మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube