రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రానికి రెడీ అయిన వైఎస్ కుమార్తె.
షర్మిలకు ఇది సాధ్యమేనా? ఇదీ.ఇప్పుడు ఎదురవుతున్న కీలక ప్రశ్న.బలమైన సామాజిక వర్గమే అయినప్పటికీ.తెలంగాణ సెంటిమెంటు సహా ఏపీ వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలన్న నినాదం నుంచి ఎదిగిన రాష్ట్రంలో సీమ ప్రాంతానికి చెందిన షర్మిల అక్కడ నెగ్గడం అంత ఈజీయే నా? అనేది ప్రధాన విషయం.పైగా సొంత సోదరుడు , ఏపీ సీఎం జగన్ కూడా సహకరించేది లేదని.అసలు రాజకీయాల్లోకి వద్దని.
సొంతగా పార్టీ కూడా పెట్టొద్దని స్పష్టం చేసిన షర్మిల దూకుడు ఏమేరకు సక్సెస్ అవుతుంది?
తెలంగాణలో భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు.అక్కడి యాస, భాష.
స్థానిక సంప్రదాయాలు.వంటివి భారీగా అలవడిన వారికే ఇక్కడి రాజకీయాలు అబ్బుతాయనే విషయం తెలిసిందే.
అలాంటి చోట.తెలంగాణ యాస రాని.
ఇక్కడి సంస్కృతి కూడా ఒంటబట్టించుకోని.ఇక్కడి ప్రజల మనసులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయని.
షర్మిల.కేవలం తండ్రి హవాను చూసుకుని పరుగులు పెడుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.

అయితే.ఏ హవా అయినా.కొన్నాళ్లు మాత్రమే పని చేస్తుంది.అంతేకాదు.తనను తానుగా తెలంగాణకు అంకితమైన నేపథ్యాన్ని షర్మిల నిరూపించుకోవాల్సిన అవసరం అత్యంత తక్కువ సమయంలోనే ఉంటుంది.కేవలం.
వైఎస్ ఇమేజ్‌నునమ్ముకుని.ముందుకు వస్తానని… అధికార పీఠం కైవసం చేసుకుంటానని చెప్పినా.
అదేమంత తేలిక విషయం కాదు.ఎందుకంటే.
ఎన్ని పాజిటివ్‌లు ఉన్నాయనే.నాణేనికి మరోవైపు.
అనే వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి.ప్రధానంగా వైఎస్ జీవించి ఉంటే.
తెలంగాణ వచ్చేది కాదనే వాదన ఇప్పటికీ.నేతలు వల్లెవేస్తున్నారు.
దీనికి షర్మిల ఏం చెబుతారు? ఇక, 2009 ఎన్నికల సమయంలో “తెలంగాణ వస్తే.రేపు ఆ రాష్ట్రంలోకి వెళ్లేందుకు.
పాస్ పోర్టు కావాలంటారు!“ అని వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ.తెలంగాణ మేదావుల చెవుల్లో గింగుర్లు తిరుగుతున్నాయి.
వీరికి ఏం చెబుతారు.మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం ఏంటి? మానుకోట ఘటన పర్యవసానం? జగన్ ఓదార్పు యాత్ర సమయంలో జరిగిన పరాభవం! ఇలా.అనేక వ్యతిరేకతలు. రాజన్న రాజ్యం ఏర్పాటుపై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయం!! మరి.
షర్మిల ఏం చెబుతారు? ఏం జరుగుతుంది? అనేది చూడాలి.