రాజన్న రాజ్యం సాధ్యమేనా… షర్మిలకు ఎదరయ్యే ప్రశ్నలివే…!
TeluguStop.com
రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.తెలంగాణ రాజకీయాల్లో అరంగేట్రానికి రెడీ అయిన వైఎస్ కుమార్తె.
షర్మిలకు ఇది సాధ్యమేనా? ఇదీ.ఇప్పుడు ఎదురవుతున్న కీలక ప్రశ్న.
బలమైన సామాజిక వర్గమే అయినప్పటికీ.తెలంగాణ సెంటిమెంటు సహా ఏపీ వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలన్న నినాదం నుంచి ఎదిగిన రాష్ట్రంలో సీమ ప్రాంతానికి చెందిన షర్మిల అక్కడ నెగ్గడం అంత ఈజీయే నా? అనేది ప్రధాన విషయం.
పైగా సొంత సోదరుడు , ఏపీ సీఎం జగన్ కూడా సహకరించేది లేదని.
అసలు రాజకీయాల్లోకి వద్దని.సొంతగా పార్టీ కూడా పెట్టొద్దని స్పష్టం చేసిన షర్మిల దూకుడు ఏమేరకు సక్సెస్ అవుతుంది?
తెలంగాణలో భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు.
అక్కడి యాస, భాష.స్థానిక సంప్రదాయాలు.
వంటివి భారీగా అలవడిన వారికే ఇక్కడి రాజకీయాలు అబ్బుతాయనే విషయం తెలిసిందే.అలాంటి చోట.
తెలంగాణ యాస రాని.ఇక్కడి సంస్కృతి కూడా ఒంటబట్టించుకోని.
ఇక్కడి ప్రజల మనసులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయని.షర్మిల.