తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తో పాటు చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో కమల్ హాసన్…( Kamal Haasan ) వీళ్లిద్దరికి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఆదరణ అయితే దక్కుతుంది.ఇక గత సంవత్సరం ఇండియన్ 2( Indian 2 ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు.ఇక ఈ సినిమా మీద భారీ నమ్మకాన్ని పెట్టుకున్నప్పటికి ఆయన విజయాన్ని మాత్రం కట్టబెట్టలేకపోయాడు…

దాంతో ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్న థగ్ లైఫ్( Thug Life ) సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారట.ఇక దాంతో పాటుగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేయబోయే విక్రమ్ 2( Vikram 2 ) సినిమా మీద కూడా ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు.దానికోసమే అహర్నిశలు ప్రయత్నం చేసి మంచి అవుట్ పుట్ రావడానికి విపరీతంగా ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా పూర్తి అయిన వెంటనే విక్రమ్ 2 సినిమాని స్టార్ట్ చేయాలనే నేపధ్యం లో ముందుకు సాగుతున్నారట.

ఇక కమల్ హాసన్ కూడా ఆ సినిమా కోసం తొందర్లోనే మార్చబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా కమల్ హాసన్ మాత్రం భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 3’( Indian 3 ) సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఇండియన్ 3 సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి అందులో ఎంత మాత్రం నిజం లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి…చూడాలి మరి కమల్ హాసన్ మరోసారి భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…
.