ఈ ఐపీఎల్ లో భారీగా ఫైన్ పడ్డ తొలి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ..!

ఐపీఎల్( IPL ) సీజన్లో భారీగా ఫైన్ పడ్డ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) తొలి స్థానంలో నిలిచాడు.డుప్లెసిస్ గాయం కారణంగా బెంగుళూరు జట్టు( RCB ) కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించలేకపోవడంతో రెండు వరుస మ్యాచ్లకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు.

 Ipl 2023 Virat Kohli Fined Rs 24 Lakh For Slow Over Rating Details, Ipl 2023, Vi-TeluguStop.com

విరాట్ కోహ్లీ సారథ్యంలో రెండు మ్యాచ్లలో కూడా బెంగళూరు విజయం సాధించింది.ఈ క్రమంలో ఆదివారం రాజస్థాన్ – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ కు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించిన విరాట్ కోహ్లీపై భారీ మొత్తంలో జరిమానా విధించబడింది.

స్లో ఓవర్ రేటింగ్ కారణంగా విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు.

ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు స్లో ఓవర్ రేటింగ్ కారణంగా పలు కెప్టెన్లకు రూ.12 లక్షల జరిమానా విధించారు.ఈ జాబితాలో బెంగుళూరు జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఉన్నాడు.అయితే బెంగళూరు జట్టు స్లో ఓవర్ రేటింగ్ దారుణంగా ఉండడంతో, బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.24 లక్షల ఫైన్ వేసినట్లు బీసీసీఐ తెలిపింది.అంతేకాకుండా కేవలం కెప్టెన్ పైనే కాకుండా మొత్తం బెంగళూరు జట్టుపై కూడా జరిమానా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

స్లో ఓవర్ రేటింగ్ నమోదు చేసిన బెంగళూరు జట్టు మొత్తానికి రూ.6 లక్షల జరిమానా లేదంటే వారి ప్యాకేజీలో 25 శాతాన్ని ఫైన్ గా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.దీంతో ఈ ఐపీఎల్ సీజన్లో రూ.24 లక్షల జరిమానా పడ్డ తొలి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ తో పాటు చాలామంది కెప్టెన్లకు స్లో ఓవర్ రేటింగ్ కారణంగా రూ.12 లక్షల ఫైన్ విధించబడింది.బెంగుళూరు జట్టు చేసిన రెండవ తప్పిదం కారణంగా జరిమానా కూడా రెట్టింపు స్థాయిలో విధించబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube