తెలుగు, తమిళ, మలయాళ భాషలలో 160కు పైగా సినిమాలలో నటించి నటిగా సరిత మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.సినిమాల ద్వారా సరిత ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో పాటు నంది పురస్కారాలను తమిళనాడు రాష్ట్ర పురస్కారాలను అందుకున్నారు.
తెలుగులో మరో చరిత్ర సినిమా సరితకు నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.ప్రముఖ మలయాళ నటుడు అయిన ముఖేష్ ను ఈ నటి పెళ్లి చేసుకున్నారు.
సరిత, ముఖేష్ లకు ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సరిత, ముఖేష్ విడాకులు తీసుకున్నారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణించడం గమనార్హం.
ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన బాలచందర్ సరితను ఇండస్ట్రీకి పరిచయం చేయగా తక్కువ కాలంలోనే నటిగా సరిత మంచి పేరును సంపాదించుకున్నారు.పలు సినిమాల్లో సరిత విలన్ రోల్స్ లో నటించి మెప్పించడం గమనార్హం.
మరో చరిత్ర సినిమాతోఓవర్ నైట్ లో స్టార్ అయిన సరిత బాలచందర్ డైరెక్షన్ లో ఏకంగా 23 సినిమాలలో నటించడం గమనార్హం.

అయితే హీరోయిన్ గా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఈ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారారు.దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన గోరింటాకు సినిమాలో సుజాతకు సరిత డబ్బింగ్ చెప్పారు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారడం గురించి ఆమె స్పందిస్తూ తన గాత్రం బాగుంటుందనే విషయం తనకే తెలీదని చెప్పుకొచ్చారు.

మరోచరిత్ర మూవీ డబ్బింగ్ సమయంలో బాలచందర్ గారు తనను డబ్బింగ్ చెప్పడానికి వద్దన్నారని సరిత పేర్కొన్నారు.ఆ సమయంలో తనకు డబ్బింగ్ టెక్నిక్ కూడా తెలియదని అయితే అక్కడ పని చేస్తున్న రికార్డింగ్ ఇంజనీర్ మాత్రం తన వాయిస్ బాగుందని డైరెక్టర్ ను ఒప్పించారని సరిత వెల్లడించారు.ఆ తర్వాత డబ్బింగ్ టెక్నిక్ ను నేర్చుకున్నానని సరిత పేర్కొన్నారు.