స్కూల్ కు వెళ్లమంటే చరణ్ అలా చేసేవారట.. షాకింగ్ విషయాలు రివీల్!

చిరుత, మగధీర, రచ్చ, నాయక్, ఎవడు, ధృవ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రామ్ చరణ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రామ్ చరణ్ ను కూడా ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

 Interesting Facts About Star Hero Ram Charan Details, Ramcharan, Sushmitha Konid-TeluguStop.com

పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ కెరీర్ ను కొనసాగిస్తూ విజయాలను అందుకుంటున్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రామ్ చరణ్ కు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.

రామ్ చరణ్ అక్క సుస్మిత చరణ్ గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ చరణ్ అంటే మొదట నాకు గుర్తొచ్చేది చిన్నప్పుడు దెబ్బలాడిందని తెలిపారు.సాధారణంగా బ్రదర్ సిస్టర్ కొట్టుకోవడం జరుగుతుందని మా దెబ్బలాట మాత్రం ఎపిక్ లా మిగిలిపోయిందని సుస్మిత వెల్లడించారు.

రామ్ చరణ్ ను స్కూల్ కు పంపించడం ప్రతిరోజూ బిగ్గెస్ట్ టాస్క్ అని ఆమె కామెంట్లు చేశారు.సోమవారం ఉదయం సిక్ నెస్ అని చరణ్ స్కూల్ కు డుమ్మా కొట్టడానికి ప్రయత్నించేవాడని ఆమె తెలిపారు.

మండే మార్నింగ్ చాలాసార్లు చరణ్ నిజంగా సిక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Shankar, Chiranjeevi, Ram Charan, Ramcharan, Susmita-Movie

చరణ్ కు చిన్నప్పుడే హీరోలా రెడీ కావడం అవన్నీ ఉండేవని ఆమె తెలిపారు.చరణ్ మధ్యలో కొన్నేళ్లు చదువు వల్ల ఇంటికి దూరంగా ఉన్నాడని ఆ సమయంలో బ్రదర్ ఉంటే ఎంత బాగుంటుందో తమకు అర్థమైందని సుస్మిత కామెంట్లు చేశారు.చరణ్ తో తనకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని సుస్మిత పేర్కొన్నారు.

Telugu Shankar, Chiranjeevi, Ram Charan, Ramcharan, Susmita-Movie

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ యాక్టర్ మాత్రమే సక్సెస్ ఫుల్ బ్రదర్ అని సుస్మిత చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని ఆమె వెల్లడించారు.చరణ్ లవ్లీ పర్సన్ అని ఆయన మమ్మల్ని గర్వపడేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube