ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్.( Adipurush ) ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా.సన్ని సింగ్ లక్ష్మణుడిగా.సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించారు.హనుమంతుడిగా దేవ్ దత్త( Devdatta ) నటించారు .భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయింది .ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన పలువురు నటి , నటులు తెలుగు వారికి చాలావరకు సుపరిచితులే.అయితే హనుమంతుడి పాత్రలో( Hanuman ) నటించే నటుడు గురించి మొదట్లో ఎక్కడ ప్రస్తావించలేదు టీజర్ విడుదలైనప్పుడు అందులో హనుమంతుడి పాత్రను ఎంతో అద్భుతంగా చూపించారు.
అప్పట్లోనే హనుమంతుడి పాత్రలో నటించిన నటుడు ఎవరు అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇక ఇప్పుడు తాజాగా సినిమా విడుదలవగా .ఇందులోనూ హనుమంతుడి పాత్రకు అత్యధిక ప్రాధాన్యత లభించింది .దీనితో ఎవరా నటుడు అనే చర్చ సాగుతుంది .ఇక హనుమంతుడి పాత్ర చేసిన నటుడు విషయానికి వస్తే .ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించిన నటుడు పేరు దేవ దత్తా నాగే.దేవా దత్తా ఓ మరాఠి నటుడు.గతంలో పలు హిందీ, మరాఠి సీరియల్స్‌లో నటించి పాపులర్ అయ్యాడు .జీ మరాఠీ ఛానల్‌లో జై మల్హర్ అనే సీరియల్‌లో లార్డ్ ఖండోబా పాత్రను పోషించి బాగా పాపులర్ అయ్యాడు.దేవదత్తా మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన వ్యక్తి .
కలర్స్ టీవీలో వీర్ శివాజీ అనే సీరియల్‌తో టెలివిజన్లో అరంగేట్రం చేసాడు.అందులో తానాజీ మలుసరే పాత్రను పోషించాడు.ఇక ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ అదరగొడుతున్నాడు.దేవదత్త 2014లో సంఘర్ష్ చిత్రం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.అతని తొలి హిందీ సినిమా 2013లో విడుదలైన వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై. ఈ సినిమా తర్వాత 2018లో విడుదలైన సత్యమేవ జయతే లో కూడా నటించాడు.
అలాగే ఓమ్ రౌత్ దర్శకత్వంలో వచ్చిన తానాజీలో కీలక పాత్రను పోషించాడు హనుమంతుడిని భక్తితో కొలిచే దేవదత్త 17 సంవత్సరాల వయసులోనే వ్యాయామం చేయడం ప్రారంభించడమే కాకుండా.తన తొలి జిమ్ సెంటర్ కి హనుమాన్ వ్యాయామశాల అనే పేరు పెట్టారు .ఈ విధంగా హనుమంతుడిని కొలిచే ఈయనకు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం .ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆయనే స్వయంగా వెల్లడించారు.ఇక ఆదిపురుష్ తర్వాత దేవదత్త క్రేజ్ మరింత పెరిగింది .