టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) సౌత్ కొరియా భారత అంబాసిడర్ కు తన ఇంట్లో తేనీటి విందును ఏర్పాటు చేశారు.ఈ తేనేటి విందులో దక్షిణ కొరియా అంబాసిడర్( South Korea Ambassador ) తో పాటు మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి వీరితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా సౌత్ కొరియా అంబాసిడర్ కు తన ఇంట్లో తేనేటి విందు ఇవ్వడమే కాకుండా కొంత సమయం పాటు వారితో సౌత్ కొరియాతో ఉన్న బంధాలపై ముచ్చటించారు.

ఇక గత కొద్దిరోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగిన G20 సదస్సులో భాగంగా దక్షిణ కొరియా అంబాసిడర్ తో కలిసి వేదికపై రామ్ చరణ్ ( Ramcharan )నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) స్టెప్పులు కూడా వేసిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వీరందరూ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే రాంచరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి వీరితో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక వీరితో కలిసి చిరంజీవి సౌత్ కొరియా భారత బంధాల గురించి మాట్లాడారు.
మన దేశ సంస్కృతులు ఒకే విధంగా ఉన్నాయని చిరంజీవి తెలియజేశారు.

ముఖ్యంగా ఆహారం, సంగీతం, సినిమాల పట్ల ప్రేమ ఇరు దేశాల వాళ్లు ఒకే రకమైన ప్రేమను కలిగి ఉన్నారని ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేసారు.ప్రస్తుతం చిరు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈయన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా షూటింగ్ పనులలో చిరంజీవి ఎంతో బిజీగా ఉన్నారు.ఇందులో తమన్నా హీరోయిన్గా నటించక కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.