ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని యంగ్ హీరోల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ).అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాతో భారీ ఫాలోయింగ్ అందుకున్న విజయ్ ఆ తర్వాత క్రేజీ లైనప్ ను సెట్ చేసుకున్నాడు.
అయితే గత రెండు సినిమాలు విజయ్ కు ప్లాప్ నే ఇచ్చాయి.
ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన విజయ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ ”లైగర్” సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి బయట పడి విజయ్ తన నెక్స్ట్ లైనప్ ను ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా సెట్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ కొత్త సినిమాను లాంచ్ చేసాడు.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి( Kushi )’ సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత మరో రెండు సినిమాలను సెట్ చేసుకున్నాడు.వీటిలో జర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో చేయబోతున్న సినిమా ఒకటి.ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ లాంచ్ జరుపుకుంది.శ్రీలీల, విజయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా నుండి తాజాగా ఒక సమాచారం బయటకు వచ్చింది.VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిన్నటి నుండి షూట్ స్టార్ట్ చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.విజయ్ గన్ పట్టుకుని సీరియస్ లుక్ లో ఉన్న పిక్ ను షేర్ చేస్తూ ఈ విషయం తెలిపారు.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసి ఈ ఏడాది లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.