దిగ్గజ మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రాంలో ఇక స్టోరీలకు కూడా లైక్ ఇచ్చే ఫీచర్ రానున్నట్లు అధికారికంగా తెలిసింది.ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రాం కథనాలు నచ్చిన వారికి ‘లైక్’కొట్టే సామార్థ్యాన్ని జోడించాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఇన్‌స్టాగ్రాం ప్రముఖ డెవలపర్ అలెశాండ్రో పలూజీ ఈ ఫీచర్‌పై ప్రస్తావించారు.
దీన్ని ట్వీటర్‌లో ఒక చిన్న వీడియోను సైతం షేర్ చేశారు.దీనిలో ఇన్‌స్టాగ్రాం మెయిన్ పేజీలో లైక్ బటన్ కనిపిస్తోంది.
యూజర్లు మల్టీపుల్ లైక్స్ అందుబాటులో ఉన్నాయి.తన ఇన్‌స్టాగ్రాం స్టోరీని పోస్ట్ చేసే వ్యక్తి ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌లో తన లైక్స్‌ను చూడవచ్చు.
ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ప్రతి యూజర్ మల్టీపుల్ లైక్స్‌ను పంపించే వెసులుబాటు ఉంటుందని నివేదికలో తెలిపారు.ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రాంలో కేవలం స్టోరీస్ ప్రతిస్పందించే అవకాశం ఉండేది.ఇది వారి మెయిన్ పేజీ డైరెక్ట్ మెసేజ్‌లలో అందుబాటులో ఉంటుంది.ఈ రియాక్షన్స్‌ను చూడకూడదనుకునే వారికి ఈ ఫీచర్ నచ్చుతుంది.
ఎందుకంటే ఇది అందుబాటులోకి వచ్చాకా, రియాక్షన్స్ ఫీచర్‌ను పొందకపోవచ్చు.గిఅఆ్ఛ్ట్చజీnజౌ ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది.
తాజా పబ్లిక్ బీటా వెర్షన్‌లో అందుబాటులో లేదు.సోషల్ మీడియా దిగ్గజం ఎప్పుడు ఈ ఫీచర్‌ను అందరికీ పరిచయం చేస్తుందో తెలియాల్సి ఉంది.
అంతేకాదు యాప్‌లో మరోకొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ఇన్‌స్టా తన వినియోగదారుల రక్షణార్థం పరిమితులను పెట్టింది.

ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి వీలు కల్పించకుండా ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు.కమెంట్లను సైతం లిమిట్ చేసింది.ఎవరైనా వివాదాస్పద, అసభ్య వ్యాఖ్యలు చేస్తే వారికి తీవ్రమైన హెచ్చరికలు ఇన్‌స్టాగ్రాం జారీ చేస్తుంది.ఈ యాప్‌లో హిడేన్ వర్డ్స్ ఫీచర్‌ను కూడా జోడించింది.దీంతో వినియోగదారుల ఇప్పటి నుంచి లిమిటెడ్ ఫీచర్‌ను కూడా చూస్తారు.ఇది మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు లేదా వ్యాఖ్యల డైరెక్ట్ అభ్యర్థనలను ఆటోమెటిగ్గా హైడ్ చేస్తుంది.
ఈ ఇన్‌స్టాగ్రాం నయా ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంది.దీన్ని సెట్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రాం ప్రైవసీ సెట్టింగ్‌లోకి అందుబాటులో ఉంది.
ఎవరైనా అసభ్యకర వ్యాక్యను పోస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇన్‌స్టా బలమైన హెచ్చరిక జారీ చేస్తుంది.