పురుషుల క్రికెట్ మాత్రమే కాదు.ఇటీవల ఉమెన్స్ క్రికెట్ ( Womens cricket )కూడా పాపులర్ అయింది.
ఉమెన్స్ క్రికెట్ లోనూ ఐపీఎల్ లాంటి టోర్నీలు జరుగుతున్నాయి.దీంతో ఉమెన్స్ క్రికెట్‌కు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది.
ఉమెన్స్ క్రికెట్ చూసేందుకు కూడా క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.ఐసీసీతో పాటు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా మహిళల క్రికెట్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
తాజాగా మహిళల క్రికెట్‌లో మరో ప్రతిష్టాత్మక మ్యాచ్ లకు రంగం సిద్దమైంది. ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్-2023కు షెడ్యూల్ ఖరారు అయింది.
హాంకాంగ్ ( Hong Kong )వేదికగా ఉమెన్స్ ఆసియా కప్ జరగనుండగా.తాజాగా ఈ మ్యాచ్ ల కోసం బీసీసీఐ టీమిండియా మహిళల జట్టును ప్రకటించింది.అండర్-19 స్టార్ క్రికెటర్ శ్వేతా సెహ్రావత్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా.తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు బారెడ్డి మల్లి అనూష, గొంగడి త్రిషాకు కూడా చోటు దక్కింది.
ఏపీకి చెందిన యువ పేసర్ అనూష అండర్-16లో రాణించగా.తెలంగాణకు చెందిన గొంగడి త్రిషా( Gongadi Trisha ) అండర్-19లో సత్తా చాటింది.జూన్ 12 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.దీని కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మొత్తం 8 జట్లు ఆసియా కప్‌లో పాల్గొనుండగా.రెండు గ్రూపులుగా జట్లను విభజించారు.ఏ గ్రూపులో టీమిండియా, పాకిస్తాన్, థాయిలాండ్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.తొలి మ్యాచ్ జూన్ 13న థాయిలాండ్ తో టీమిండియా తలపనుండగా.జూన్ 17న దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది.

ఇండియా జట్టు: శ్వేతా సెహ్రావత్(కెప్టెన్), సౌమ్య తివారీ(వైస్ కెప్టెన్), శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, మస్మాన్ మాలిక్, త్రిషా గొంగడి, ఉమా చెత్రీ, మమత మడివాలా, యశశ్రీచ గౌతమ్చ పర్షవి చెప్పాచ కశ్యప్, అనూష
.