తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “తెలంగాణ ప్రభుత్వ పథకాల”పై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా విద్యార్థులు తెలంగాణకు హరితహారం,రైతుబంధు మొదలగు అంశాలపై ఎక్కువగా స్పందించి పోటీలలో పాల్గొని వ్యాసాలు రాశారు.
వ్యాసరచన పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికీ త్వరలో బహుమతులు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, క్యాతం సత్యనారాయణ ,వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి,చెరుకు భూమక్క,బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







