మొదటి ఆఫ్ సెంచరీ నమోదు చేసి రిజ్వాన్ ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చిన ఇండియా స్టార్ బ్యాట్స్మెన్..

టి20 వరల్డ్ కప్ 2022 ఆస్ట్రేలియాలో ప్రారంభమై హోరాహోరీగా క్రికెట్ టీమ్ల మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి.వీటిలో టీమిండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

 India's Star Batsman Who Registered The First Off Century And Pushed Rizwan Back-TeluguStop.com

ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.టీమిండియా రెండవ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఈరోజు జరిగింది.ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

టీ20 వరల్డ్‌కప్ లో సూర్య కుమార్ యాదవ్ తొలి హాఫ్‌ సెంచరీ సాధించాడు. విరాట్‌ కోహ్లి 62నాటౌట్‌ తో కలిసి పరుగుల వరద పారించి 25 బంతుల్లోనే 50 పరుగులతో అజేయంగా నిలబడ్డాడు.సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో స్లో గా సాగుతున్న భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చి 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది ఫ్యాన్స్‌ లో ఉత్సాహం నింపాడు.

ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌, పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.ఈ సంవత్సరం అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ ఓపెనర్ రిజ్వాన్‌ ఇప్పటి వరకు 825 పరుగులు చేశాడు.

అయితే నెదర్లాండ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో సిక్స్‌ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ 867 పరుగులతో రిజ్వాన్ ను అధిగమించాడు.టీ20లలో వరల్డ్‌ నెంబర్‌ 1గా రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి ఈ ముందుకు దూసుకువచ్చాడు.ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.అయితే t20 ప్రపంచకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సూర్య 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.

ఈ సంవత్సరం సూర్య కుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20లలో తొలి సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇక సూపర్‌-12లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా టీమిండియా నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube