హిందూపురం వైసిపి నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో దర్యాప్తు

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం వైసిపి నేత రామకృష్ణా రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది, ఈ హత్య కేసులో మొత్తం 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్ పిఎ గోపీకృష్ణ ఉన్నట్లు గుర్తించారు.

 Investigation In Hindupuram Ycp Leader Ramakrishna Reddy's Murder Case-TeluguStop.com

అంతే కాకుండా హంతకులలో ఇద్దరు మైనర్లు, నలుగురు కర్ణాటక వాసులు, ఇద్దరు టిడిపి కార్యకర్తలు ఉన్నారని పోలీసులు తెలిపారు.నిందితులకు ఆశ్రయం కల్పించిన శకుంతల అనే మహిళపై కేసు నమోదు చేశారు.

కొద్దిరోజుల క్రితం కారులో నుంచి దిగుతున్న రామకృష్ణా రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచి అతి దారుణంగా చంపేశారు, అయితే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ మధ్య విబేధాలు నెలకొన్న సమయంలో ఈ హత్య చేటుచేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube