హిందూపురం వైసిపి నేత రామకృష్ణారెడ్డి హత్య కేసులో దర్యాప్తు
TeluguStop.com
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం వైసిపి నేత రామకృష్ణా రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది, ఈ హత్య కేసులో మొత్తం 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల్లో ఎమ్మెల్సీ ఇక్బాల్ పిఎ గోపీకృష్ణ ఉన్నట్లు గుర్తించారు.అంతే కాకుండా హంతకులలో ఇద్దరు మైనర్లు, నలుగురు కర్ణాటక వాసులు, ఇద్దరు టిడిపి కార్యకర్తలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
నిందితులకు ఆశ్రయం కల్పించిన శకుంతల అనే మహిళపై కేసు నమోదు చేశారు.కొద్దిరోజుల క్రితం కారులో నుంచి దిగుతున్న రామకృష్ణా రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో నరికి, కత్తులతో పొడిచి అతి దారుణంగా చంపేశారు, అయితే రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ మధ్య విబేధాలు నెలకొన్న సమయంలో ఈ హత్య చేటుచేసుకోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.