మహిళా క్యాబ్ డ్రైవర్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా బెదిరించిన కేసులో భారత సంతతికి చెందిన బ్రిటీష్ పోలీస్ అధికారి దోషిగా తేలాడు.లండన్ సౌత్ ఈస్ట్ కమాండ్ యూనిట్‌కు అటాచ్ అయిన ట్రైనీ డిటెక్టివ్ కానిస్టేబుల్ అజిత్ పాల్ లోటే ఈ కేసుకు సంబంధించి బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెదిరించడం, అధికార దుర్వినియోగం, అవమానకరమైన ప్రవర్తనకు గాను పబ్లిక్ ఆర్డర్ చట్టం లోని సెక్షన్ 4ఏ కింద అతనిపై అభియోగాలు మోపారు.
ఫిబ్రవరి 2022లో జరిగిన ఘటనలో లండన్‌లోని వాండ్స్‌వర్త్‌లో ఒంటరి మహిళా డ్రైవర్‌తో లోటే వాగ్వాదానికి దిగాడు.
వారెంట్ కార్డ్ చూపించి.కారును ముందుకు పోనించాలని అతను డిమాండ్ చేశాడు.
అతని చర్యలతో ఆమెకు సహనం నశించింది.దీంతో ఆమె లోటేను, అతని వాహనాన్ని ఫోటో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఏడాది జూన్‌లో లోటే ఆ వాహనాన్ని నడపడం ఆపివేశాడు.

ఈ ఘటనపై సౌత్ ఈస్ట్ కమాండ్ యూనిట్ చీఫ్ సూపరింటెండెంట్ ట్రెవర్ లారీ మాట్లాడుతూ.లోటే ప్రవర్తన తప్పన్నారు.మహిళా క్యాబ్ డ్రైవర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ఆయన అన్నారు.
మెట్ వృత్తి నైపుణ్యం, సమగ్రత, ధైర్యం, కరుణ వంటి విలువతో నడపబడుతుందన్నారు.మెట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్‌కు ఈ సంఘటన గురించి తెలుసునని, అందువల్లే లోటేని పరిమిత విధుల్లో వుంచారని ట్రెవర్ పేర్కొన్నారు.
క్రిమినల్ ప్రొసీడింగ్‌లు ముగిసినందున లోటే ఇప్పుడు దుష్ప్రవర్తనకు సంబంధించిన విచారణకు హాజరవుతారని ఆయన తెలిపారు.