ఇటీవల వాషింగ్టన్ డీసీలోని( Washington DC ) భారత దౌత్య కార్యాలయంలో( Indian Embassy ) పనిచేసే ఒక అధికారి చిన్న వయసులోనే మృతి చెందారు.ఆయన మృతదేహం అనుమానాస్పద పరిస్థితుల్లో కనుగొనబడింది.
ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఈ ఘటనను విచారిస్తున్నారు.
ఆ అధికారి ఆత్మహత్య చేసుకున్నారా లేదా అన్న విషయం కూడా విచారణలో భాగంగా ఉంది.
వైద్యాధికారులు మాట్లాడుతూ ఆ అధికారి ఉరివేసుకుని చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు.కానీ అతని గుర్తింపును బయట పెట్టలేదు.“ఇండియన్ ఎంబసీకి చెందిన ఒక వ్యక్తి 2024 సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం మరణించారని విచారంతో తెలియజేస్తున్నాము.అధికారి మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి తీసుకెళ్లడానికి అన్ని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులతో మాకు సంప్రదింపులు జరుగుతున్నాయి.” అని ఇండియన్ ఎంబసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
“మరణించిన వ్యక్తి గురించి మరింత వివరాలను బయటకు చెప్పడం లేదు.ఎందుకంటే కుటుంబానికి కొంత స్వతంత్రత ఇవ్వాలని మేం భావిస్తున్నాం.ఈ కష్ట సమయంలో కుటుంబానికి మా ఆలోచనలు, ప్రార్థనలు అండగా ఉంటాయి.” అని వారు చెప్పారు.వారు ఇంకేమీ వివరాలు చెప్పలేదు.
ప్రస్తుతానికి ఎటువంటి కుట్ర కోణంలో ఆధారాలు దొరకలేదు.ఈ అధికారి మరణం వెనుక గల కారణాన్ని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.అతి త్వరలోనే ఆ విషయాన్ని కనిపెట్టనున్నారు.
అయితే ఇండియన్ కమ్యూనిటీలో( Indian Community ) ఈ మృతి కలకలం రేపుతుంది.ఈ ఇండియన్ ఎంబసీ, 2107 మసాచుసెట్స్ అవెన్యూ NW వద్ద ఉంది.
ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అతను ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని పేర్కొంటున్నారు.ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని, అలాగని చనిపోతే ఈ భూమిపై మానవాళి ఉండదని పేర్కొంటున్నారు.