గడిచిన రెండు,మూడు రోజులుగా ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగంలో కొంతమంది భారత సంతతి వ్యక్తులకి కీలక భాద్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతోందని.తాజాగా మరో భారత సంతతి వ్యక్తికి ట్రంప్ అత్యంత కీలక పదవిని అప్పగించారు.
అమెరికాలో ఆర్దికవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రేమ్ పరమేశ్వరన్ ను అధ్యక్ష సలహా కమిటీలో సభ్యునిగా తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు.వీరిలో ఏకైక భారతీయ ఇండో అమెరికెన్ పరమేశ్వరన్ ఒక్కరే కావడం విశేషం.ఇక ఈ అధ్యక్ష సలహా కమిటీ ఆసియాన్ అమెరికన్లు, పసిఫిక్ ద్వీపకల్ప వాసుల స్థితిగతులపై ఈ కమిటీ పని చేస్తుంది.
ఇదిలాఉంటే ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్న ఆయన , ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నార్త్ అమెరికా ఆపరేషన్స్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
.
తాజా వార్తలు