ఆ సినిమాలో అమితాబ్ అంత బాధ‌లోనూ న‌టించారు: జ‌య‌ప్ర‌ద‌

1984లో బాలీవుడ్ సినిమా ‘షరాబి’ విడుద‌ల‌య్యింది.ఇందులో అమితాబ్ బచ్చన్, నటి జయప్రద న‌టించారు.

 In That Movie Amitabh Acted In So Much Pain Jayaprada Details, Amitabh, Jayaprad-TeluguStop.com

వీరిద్దరి జోడీ తెరపై సంచ‌ల‌నాలు సృష్టించింది.ఏకంగా 18 పాటలతో అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాన్ని సృష్టించింది.

ప్రేక్షకుల హృదయాల్లో ఈ చిత్రం ప్ర‌త్యేక‌ ముద్ర వేసింది.ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన ఉదంతాల‌ను న‌టి జ‌య‌ప్ర‌ద ఒక రియాలిటీ షోలో పంచుకున్నారు.

ఇది విన్న‌వారంతా తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ప్రముఖ కళాకారిణి, రాజకీయ నాయకురాలు జ‌య‌ప్రద జీటీవీ రియాల్టీ షో ‘స రే గ మ ప లిటిల్ చాంప్స్’లో అతిథిగా కనిపించారు.

ఈ సమయంలో ఆమె ‘షరాబి’ చిత్రంలోని ‘ముజ్కో నౌలాఖా మంగా దే’ పాట చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ఒక ఉదంతాన్ని ఉద‌హ‌రించారు.షూటింగ్‌లో గాయపడినప్పటికీ అమితాబ్ బచ్చన్ ఈ పాట చిత్రీక‌ర‌ణ‌లో ఎలా పాల్గొన్నారో చెప్పారు.

అలాగే షూటింగ్ సమయంలో అమితాబ్ త‌న‌కు చాలా స‌హాయం చేశార‌ని తెలిపారు.షోలో జయప్రద మాట్లాడుతూ, నౌలాఖా మంగా దే పాట‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు దీపావళి ట‌పాసుల కార‌ణంగా అమితాబ్‌ చేతికి గాయం కావడం నాకు ఇప్పటికీ గుర్తుంది.

పాటలోని ఒక భాగంలో అమితాబ్‌ ఘుంగ్రూ ప్లే చేస్తున్నారు.అయితే అతను నొప్పితో ఉన్నందున, అప్పటికే గాయపడినందున, సన్నివేశం చిత్రీకర‌ణ‌లో అత‌ని చేతి నుంచి రక్తస్రావం అయ్యేది.

అయినప్పటికీ, అతను తన చేతులను ఐస్ బాక్స్‌లో ఉంచి సన్నివేశం షూటింగ్‌ను పూర్తి చేశారు.అతని అంకితభావం, దూర‌దృష్టి ప్రతి కళాకారుడు నేర్చుకునేందుకు ఒక ఉదాహరణగా నిలిచింద‌న్నారు.

అమితాబ్‌ నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు.

Telugu Amitab Bachhan, Amitabh, Jayaprada, Jayapradaamitab, Sharabi-Movie

చిత్ర‌రంగంలో జయప్రదకు 50 ఏళ్లు

జయప్రద తెలుగు, హిందీ సినిమాల్లో న‌టించారు.సర్గం, ఊరికి మొనగాడు, కామ్‌చోర్, కవిరత్న కాళిదాస్, సాగర‌ సంగమం, తోఫా, షరాబీ, మక్సద్, సంజోగ్, ఆఖ్రీ రాస్తా, ఆజ్ కా అర్జున్ వంటి అనేక చిత్రాలలో ఆమె తన నటనా నైపుణ్యాన్ని చాటారు.రియాలిటీ షోల‌లో ఆమె పాల్గొంటున్నారు.

చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు అంకితం చేస్తూ ఈ రియాలిటీ షో ఎపిసోడ్ చిత్రీక‌రించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube