అన్నా క్యాంటీన్ ల విషయంలో సీఎం జగన్ పై లోకేష్ సంచలన పోస్ట్..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( TDP Nara Lokesh ) పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే.జనవరి 27 తారీఖున మొదలుపెట్టిన ఈ “యువగళం” పాదయాత్ర( Yuvagalam Padayatra )లో ఇప్పటికి 200 రోజులలో… 2500 కిలోమీటర్ లకి పైగా లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది.

 In Nuzividu Nara Lokesh Selfie Challenge To Ap Cm Jagan, Nara Lokesh, Ap Cm Jaga-TeluguStop.com

ఈ క్రమంలో ప్రతి చోట ప్రజా సమస్యల వింటూ మరోపక్క వైసీపీ ప్రభుత్వం( YCP Government )పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ప్రస్తుతం నూజివీడులో జరుగుతున్న ఈ పాదయాత్రలో అన్నా క్యాంటీన్ వద్ద నిలబడి సెల్ఫీ ఫోటో దిగి.

వైసీపీ అధినేత సీఎం జగన్ పై ట్విట్టర్ లో నారా లోకేష్ సంచలన పోస్ట్ పెట్టారు.

“ప్రజల రక్తంతాగే జగనాసురుడికి పేదల ఆకలి విలువ తెలుస్తుందా?…ఇది నూజివీడులోని అన్నా క్యాంటీన్( Anna Canteen ).తాను పేదలపక్షమనే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి( YS Jagan ) అన్నా క్యాంటీన్లను రద్దుచేసి వారి నోళ్లుకొట్టాడు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి లక్షలాది పేదల ఆకలి తీర్చాం.

అధికారంతోపాటు పదిమందికి సాయపడే గుణం కూడా ఉన్నవాడే నిజమైన పాలకుడవుతాడు.ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా లక్షలకోట్లు పోగేసుకుంటున్న జగన్ కు ఆకలిగొన్న అభాగ్యులకు పట్టెడన్నం పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు.

ధనదాహంతో ప్రజల రక్తం తాగుతున్న ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి జగనాసురుడికి అన్నార్తుల ఆకలి విలువ ఎలా తెలుస్తుంది?!” అనీ ట్విట్టర్ లో నారా లోకేష్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube