వర్షాకాలం వచ్చేసింది.మన మొబైల్స్ వర్షంలో తడిస్తే వాటి పరిస్థితి ఏంటి? వాటిలోకి నీరు పోతే ఇంక అంతే అది పూర్తిగా పాడైపోతుంది.అయితే.అది వర్షంలో తyì చినా.నీటిలో మునిగినా తక్షణమే ఏం చేయాలో తెలుసుకుందాం.ముఖ్యంగా మొబైల్ అందరి వద్ద ఉంటుంది.
అది సాధారణం.మొబైల్ లేనిదే ఏ పని చేయలేం.
ఉదయం నుంచి మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకు మొబైల్ వాడకం ఎక్కువ.ఎంత జాగ్రత్త తీసుకున్నా.
ఒక్కోసారి మొబైల్ మన చేతిలో నుంచి జారి నీటిలో పడిపోవటం లేదా వర్షంలో తడిసినా.తక్షణమే నీరు లోపలికి చేరుకుంటుంది.
ఆ తర్వాత టచ్ ప్యాడ్ పనిచేయదు.అలాంటి సమయంలో కొన్ని పనులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.నీటిలో తడిసిన మొబైల్‌ను వెంటనే స్విచ్ఛాఫ్ చెయ్యాలి.మొబైల్‌ను వాడకూడదు.
ముందుగా మొబైల్‌ని నీటిలో నుంచి తీశాక ఎలా పట్టుకున్నారో అలాగే ఉంచాలి.అటూ ఇటూ తిప్పకూడదు.
వేడి కూడా చేయకూడదు.ఎండలో కూడా పెట్టవద్దు.
మొబైల్ బ్యాక్ కవర్ తీసి, బ్యాటరీ, సిమ్, మెమరీ కార్డులను తీసేయాలి.ఆ తర్వాత మొబైల్‌ని పొడి గుడ్డతో తుడవాలి.

ఇప్పుడు ఓ కవర్లో బియ్యం తీసుకొని, అందులో ఫోన్, బ్యాటరీ ఉంచి… పూర్తిగా బియ్యంతో కప్పేసి గాలి చేరకుండా కవర్ని క్లోజ్ చెయ్యాలి.బియ్యానికి నీటిని పీల్చేసే శక్తి బాగా ఉంటుందని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు.ఒక రోజంతా అలానే ఉంచాలి.ఆ మరుసటి రోజు మళ్లీ మొబైల్ మరోసారి తుడవాలి.అప్పుడు బ్యాటరీ, సిమ్ వేసి ఆన్ చేసి వాడుకోవచ్చు.అప్పటికీ మొబైల్ పనిచేయకపోతే, ఛార్జింగ్ పెట్టాలి.

ఆన్ కాకపోతే కొత్త బ్యాటరీ వేసి ప్రయత్నించాలి.అప్పుడు కూడా ఆన్ కాకపోతే, ఇక సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లక తప్పదు.ఆ పని మనమే చేసేద్దాం అనుకోకూడదు.ఏముంది పార్టులన్ని ఊడదీసి మళ్లీ పెట్టోయోచ్చు అని ప్రయత్నించ కూడదు.దీనికి నిపుణులైనా సర్వీస్ సెంటర్ నిర్వాహకులు రిపేర్ చేయడమే మేలు.ఎందుకంటే ఒక్కోసారి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది.
లేదా మొబైల్లో వైర్ల లింకులు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది.అందుకే ఆ పనిని సర్వీస్ వాళ్లకే వదిలేయడం మేలు.